రేషన్ డీలర్ల సమస్యలు తీరేదేన్నడు...?
ABN , Publish Date - Dec 09 , 2024 | 11:06 PM
రేషన్ డీలర్లు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పాలకులకు ఏళ్ల తరబడి మొర పెట్టుకుంటున్నా మోక్షం లభించడం లేదు. నెల రోజులు శ్రమ పడితే చివరకు మిగిలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సమస్యలు తీరుతాయని గంపెడు ఆశలు పెట్టుకున్న డీలర్లకు నిరాశే ఎదురైంది.

మంచిర్యాల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రేషన్ డీలర్లు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పాలకులకు ఏళ్ల తరబడి మొర పెట్టుకుంటున్నా మోక్షం లభించడం లేదు. నెల రోజులు శ్రమ పడితే చివరకు మిగిలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సమస్యలు తీరుతాయని గంపెడు ఆశలు పెట్టుకున్న డీలర్లకు నిరాశే ఎదురైంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో డిమాండ్‌లు తీరుస్తామనే హామీలు డీలర్లను ఊరిస్తూ వచ్చాయి. ఏ ఒక్క సమస్యా తీరలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ డీలర్లకు హామీలు గుప్పిం చింది. రేషన్ డీలర్లకు గౌరవ వేతనం కల్పిస్తామని మాటి చ్చింది. ఏడాది గడిచినా అది కార్యరూపం దాల్చలేదు. ఇలా ఎన్నో సమస్యలను పాలకులకు ఎప్పటికప్పుడు విన్నవిస్తున్నా కనీసం చర్చలు కూడా జరపడం లేదని పేర్కొంటున్నారు.
గౌరవ వేతనం కోసం ఆందోళన
రేషన్ డీలర్ల ముందు ఉన్న ప్రధాన సమస్య గౌరవ వేతనం. నెలకు రూ.30 వేల గౌరవ వేతనాన్ని ఇవ్వాలని డీలర్లు ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నారు. కేరళ, తమిళ నాడు రాష్ట్రాల్లో గౌరవ వేతనం కల్పిస్తున్నందున తెలం గాణలోనూ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ డిమాం డ్‌పై గత ప్రభుత్వం డీలర్లకు న్యాయం చేస్తామని ప్రకటించింది. కాని పదేళ్లలో ఈ అంశంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెదవి విప్పలేదు. ఇదిలా ఉండగా 2023లో జరిగిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ డీలర్లకు గౌరవ వేతనం హామీ ఇచ్చినట్లు డీలర్లు చెబుతున్నారు. రూ.5 వేల గౌరవ వేతనం కల్పిస్తామనే హమీని ఎన్నికల మేని ఫెస్టోలో కూడా పొందుపరిచినట్లు పేర్కొంటున్నారు. యేడాది గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పం దించి గౌరవ వేతనం ఇవ్వాలని విన్నవిస్తున్నారు. ఈ విష యమై రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.
సకాలంలో అందని కమీషన్లు....
రేషన్ డీలర్లకు కమీషన్ డబ్బులు ప్రతీనెల క్రమంగా అందడం లేదనే అభిప్రాయాలున్నాయి. రెండు, మూడు నెలలకు ఒకసారి కమీషన్ డబ్బులు అకౌంట్లలో జమ అవుతున్నట్లు చెబుతున్నారు. నెలవారీగా డబ్బులు అం దకపోవడంతో డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ’అమ్మ హస్తం’ పథకం అమలు చేశారు. బియ్యంతోపాటు చక్కెర, పప్పులు, నూనెతోపాటు 9 వస్తువులను పంపిణీ చేసేవారు. ఇది డీలర్లకు లాభ సాటిగానే ఉండేది. అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఖర్చులు పెరగడం, కమీషన్లు తగ్గడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. అమ్మ హస్తం మాదిరిగా నిత్యావసరాల సరుకుల విక్రయంపై చర్యలు తీసుకోవాలని డీలర్లు వేడుకుంటున్నారు.
మిగిలేది రిక్తహస్తాలే.....
ఖర్చులన్నీ పోనూ చివరకు మిగిలేది రిక్తహస్తమేనని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. దిగుమతి చార్జీలు తామే భరించడం వల్ల ఏమీ మిగలడం లేదంటున్నారు. ఒక్కోసారి తామే అదనంగా భరించాల్సిన దుస్థితి ఏర్పడుతుందనేది డీలర్ల వాదన. ఒక డీలర్ వంద క్విం టాళ్ల బియ్యం బస్తాలను దిగుమతి చేసుకుంటే రవాణా, డైవ్రర్, కూలీ మొత్తంగా రూ.2 వేల వరకు భరించాల్సి వస్తోందని చెబుతున్నారు. వంద క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయిస్తే క్వింటాల్‌కు రూ.140 చొప్పున మొత్తంగా రూ.14 వేలు కమీషన్ రూపంలో డీలర్‌కు లభిస్తుంది. ఈ ఆదాయంలో షాపు అద్దె, విద్యుత్ చార్జీలు, హమాలీ, ఇతరత్రా ఖర్చుల చెల్లింపులు జరిగితే ఏమీ మిగలడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో దిగుమతి చార్జీలు మరో భారంగా మారాయంటున్నారు. దీనిని ప్రభుత్వం గుర్తించి దిగుమతి చార్జీలను భరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని ద్వారా డీలర్‌కు నెలకు రూ.2 వేలు మిగిలే అవకాశం ఉందంటున్నారు. ఎంఎల్‌ఎస్ పాయిం ట్లలో కాంటా సరిగ్గా ఉండక బస్తాకు రెండు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. క్వింటాల్ బియ్యం బస్తా కచ్చితమైన తూకంతో డీలర్లకు సరఫరా చేయాలని, షాపు రెన్యూవల్ శాశ్వత ప్రాతిపదికన జరగాలని, ప్రతి నెల 1వ తేదీలోగా బియ్యం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సమస్యలు పరిష్కరించాలి
మోటపలుకుల సత్తయ్య, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గౌరవ వేతనం రూ.5 వేలు వెంటనే కల్పించాలి. డీలర్లకు ప్రస్తుతం ఉన్న కమీషన్ రూ.140 నుంచి రూ.300కు పెంచుతామన్నారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. డీలర్ చనిపోతే అతని స్థానంలో వారసులకు అవకాశం కల్పిస్తామన్నారు. కరెం ట్ బిల్లు, గది కిరాయి చెల్లిస్తామన్నారు. డీలర్ల సమస్య లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు మానవతా దృక్పథంతో సమస్యలు పరిష్కరించాలి.