Share News

ఇళ్లను పంచే శక్తిలేని నాయకులు మీరు

ABN , Publish Date - Dec 15 , 2024 | 10:25 PM

మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన 400 డబుల్‌ బెడ్రూం ఇళ్లను పంచే శక్తిలేని నీవు అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును ఉద్దేశించి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివా రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఇళ్లను పంచే శక్తిలేని నాయకులు మీరు

మంచిర్యాల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన 400 డబుల్‌ బెడ్రూం ఇళ్లను పంచే శక్తిలేని నీవు అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును ఉద్దేశించి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివా రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ మున్సిపాలి టీల్లో నిత్యం తాగునీరు ఇచ్చిన ఘనత తమ దేనన్నారు. కొబ్బరికాయలు కొట్టే బ్యాచ్‌ తాను కాదని, అభివృద్ధి పనులు చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. 20 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని 6 నెలల్లోనే చేసి చూపించాన న్నారు. అభివృద్ధిపై తాను ఎక్కడికి రావడాని కైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులు నష్టపోయారని, తాలు, తప్ప పేరుతో ధాన్యం కొనుగోళ్లలో 10 కిలోలు కోత పెట్టారని ఆరోపించారు. కోత పెట్టిన ధాన్యం డబ్బులను ఎవరు బుక్కారని ప్రశ్నిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి లీటరు నీటిని తీసుకోకుండా కోటి 53 లక్షల టన్నుల ధాన్యం పండించామన్నారు. మీ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు, కూలుడు కూడా అయిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిం దని, పదేళ్ల పాలనలో మెస్‌ చార్జీలు కూడా పెంచలేదన్నారు. తమ ప్రభుత్వం మెస్‌ చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీలను పెంచిందన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ 89 శాతం పూర్తయిందని, కొందరు రైతుల డాక్యుమెం ట్లు, ఇతర సమస్యల వల్ల రుణమాఫీ కాలేద న్నారు.

త్వరలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ హయాం లో లక్ష రుణమాఫీ విడుతల వారీగా చెల్లిం చగా అవి వడ్డీలకే సరిపోయాయని అన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులకు ఇప్పటి వరకు తమ ప్రభుత్వం రూ.62 వేల కోట్లు వడ్డీ చెల్లించిందన్నారు. బీజేపీ నాయకులు కొత్త బిచ్చగాళ్ల లాగా తమ పబ్బం గడుపుకోవ డానికి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నార న్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద 155 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారా యణ, నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ వేణు, వైస్‌ చైర్మన్‌ సల్ల మహేష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి ప్రభాకర్‌, పట్టణాధ్యక్షుడు నరేష్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ వసుం ధర, రజిత, పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 10:25 PM