ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: కౌలు రైతులకూ ‘భరోసా’!

ABN, Publish Date - Jul 20 , 2024 | 03:30 AM

రైతు భరోసా, పంటల బీమా పథకాల అమలుకు రూపకల్పన చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు పేర్కొన్నారు.

  • అందరి అభిప్రాయం మేరకే ‘రైతుభరోసా’ నిర్ణయం.. వరితో కష్టాలు... ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలొస్తాయి

  • దేశానికి కోటి టన్నుల పామాయిల్‌ కావాలి.. 3లక్షల టన్నులే ఉంది

  • ఒక్క రైతుబంధునే గత సర్కారు

  • సర్వరోగ నివారిణిగా చూపింది: తమ్ముల

  • రుణమాఫీ ద్వారా సోనియా, రాహుల్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాం : ఉత్తమ్‌

  • ఐటీ ఉన్న రైతులకూ భరోసా: పొంగులేటి

  • రైతు ఆకాంక్ష మేరకే భరోసా: పొన్నం

  • ఐదెకరాలకే భరోసా ఇవ్వాలి: జీవన్‌ రెడ్డి

  • కరీంనగర్‌లో అభిప్రాయసేకరణ

కరీంనగర్‌ టౌన్‌, కరీంనగర్‌ అర్బన్‌, పెద్దపల్లి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా, పంటల బీమా పథకాల అమలుకు రూపకల్పన చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో రైతుభరోసా పథకం ఎలా అమలు చేయాలన్నదానిపై అన్నదాతల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల, పొన్నం, శ్రీధర్‌ బాబు, పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా, అంతకుముందు విలేకర్ల సమావేశంలో, మీడియాతో ఇష్టాగోష్టిగానూ మంత్రులు మాట్లాడారు. కౌలురైతులకు రైతుభరోసా పథకం వర్తింపజేస్తామని, అయితే వారికి ఈ సాయం ఎలా ఇవ్వాలనేదానిపై సూచనలివ్వాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేల ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు.


వరిసాగుతో కష్టనష్టాలుంటాయని.. బదులుగా అంతర పంటలు వేసుకునే వీలుండే ఆయిల్‌పామ్‌ సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చునని రైతులకు సూచించారు. ఆయిల్‌పామ్‌ కంపెనీలు కొనుగోలు చేసి మూడురోజుల్లోనే డబ్బులు ఖాతాల్లో జమచేస్తాయని, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లాగా ప్రతినెలా డబ్బులు వస్తాయని చెప్పారు. 1988లో ఎన్టీఆర్‌ ఆయిల్‌ఫామ్‌ మొక్కలను నాటారని 1992 వరకు వాటిని పరిశీలించి తాను ఆయిల్‌ పామ్‌ సాగుచేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నానని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో డ్రిప్‌ రైతులకు, ఆయిల్‌ పామ్‌ రైతులకు సబ్సిడీ పథకాలను అమలు చేయలేదని ఆరోపించారు. ఒక్క రైతుబంధు పథకాన్నే సర్వరోగ నివారిణిగా చూపించారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ విషయంలో కూడా లక్ష రూపాయలను ఏకకాలంలో మాఫీ చేయలేదని విమర్శించారు. దేశానికి కోటి టన్నుల పామాయిల్‌ అవసరం ఉందని, కానీ 3 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని, మిగతాది మలేసియా, ఇండోనేసియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తుమ్మల తెలిపారు.


ఆయిల్‌ పామ్‌ సాగు చేసే వారికి మూడేళ్లలో 51 వేల రూపాయల సబ్సిడీ వస్తుందని, ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని మరింత పెంచాలని ప్రధాని మోదీని కోరామన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వెళుతోందని.. సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నాలను బీజేపీ, బీఆర్‌ఎస్‌ మానుకోవాలన్నారు. రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టులో పూర్తి చేస్తామని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ రైతు సమస్యలపై ఏనాడూ మాట్లాడకుండా ఇప్పుడు రైతు రుణమాఫీ, రైతుభరోసా, ఆరుగ్యారెంటీల అమలును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.


అనంతం పొంగులేటి మాట్లాడారు. ఐటీ ఉన్న రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వరంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని.. ఇది జీర్ణించుకోలేక విపక్షాలు అవకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. పెట్టుబడి సాయాన్ని గతంలో మాదిరిగా ఇష్టారాజ్యంగా అమలు చేయబోమని చెప్పారు. గత ప్రభుత్వం మిషన్‌ భగీరథ కోసం రూ.39వేల కోట్లు ఖర్చుచేసిందని.. అయినా కూడా ఊర్లలో 30 శాతం ఇళ్లకు కూడా నీళ్లు రావడం లేదన్నారు. అనంతరం పొన్నం మాట్లాడారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగానే రైతు భరోసా అమలు చేస్తామని పొన్నం పేర్కొన్నారు. రైతు సంఘాలు, పార్టీ నేతలు, మేధావుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.


బీఆర్‌ఎస్‌ మునిగిపోతోందనే.. :ఉత్తమ్‌

రైతుల రుణమాఫీ ఓ విప్లవాత్మకమైన మార్పు అని, చరిత్రలో నిలుస్తుందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీ అమలు ద్వారా సోనియా, రాహుల్‌ ఇచ్చిన హామీ నెరవేర్చామని చెప్పారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ సర్కారు మాఫీ చేసింది రూ.25వేల కోట్లు మాత్రమేనని.. కాంగ్రెస్‌ సర్కారు 8నెలల్లోనే రూ.31వేల కోట్లు మాఫీ చేసిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద తప్పిదమని, దీన్ని సాగునీటి కోసం కాకుండా కమీషన్ల కోసమే నిర్మించి ప్రజా ధనాన్ని వృథా చేశారని.. ఫలితంగా రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని పేర్కొన్నారు. తుమ్మడిహెట్టి వద్ద నిర్మించాల్సి న ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చి అతిపెద్ద తప్పుచేశారని విమర్శించారు. ఈ నెలాఖర్లో సదర్‌మాట్‌ బ్యారేజీని, ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టులోని రాజీవ్‌ గాంధీ కెనాల్‌ను సీఎం ప్రారంభోత్సవం చేస్తారని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మునిగిపోతోందని, దీన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తించి కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు.


ఐదెకరాలకు పరిమితం చేయాలి: జీవన్‌రెడ్డి

చిన్న, సన్నకారు రైతులే కాకుండా ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ సాగు చేస్తున్న ఐదు ఎకరాలకు ఆర్థిక సహాయాన్ని పరిమితం చేసి.. అందరికీ పథకాన్ని వర్తింపజేయాలని ఓ రైతుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతుల్లో ఎక్కువమంది 10 ఎకరాల వరకు రైతుభరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఇవ్వాలని.. రాళ్లు రప్పలు, కొండలు, గుట్టలకు పెట్టుబడి సాయం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 20 , 2024 | 03:30 AM

Advertising
Advertising
<