ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu: ఏపీ సీఎంవో అంతా కలెక్టరేట్‌లోనే

ABN, Publish Date - Sep 03 , 2024 | 05:28 AM

వరద సహాయచర్యలను వరుసగా రెండోరోజూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మరం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ను తన కార్యాలయంగా మార్చుకున్నారు.

  • బెజవాడ కలెక్టరేట్‌లో చంద్రబాబు

  • వరద ప్రాంతాల్లో తిరుగుతూ, విరామంలో కలెక్టరేట్‌లో సమీక్షలు

అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వరద సహాయచర్యలను వరుసగా రెండోరోజూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మరం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ను తన కార్యాలయంగా మార్చుకున్నారు. యావత్‌ సీఎం కార్యాలయం కలెక్టరేట్‌లోనే తిష్టవేసింది. రోజంతా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, బాధితులను ప్రత్యక్షంగా కలుసుకుని ధైర్యం చెప్పడం, మధ్యలో విరామంలో కలెక్టరేట్‌కు చేరుకొని సమీక్షలు నిర్వహించడం.. ఇలా అలుపెరగకుండా చంద్రబాబు పనిచేస్తున్నారు.


ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు వరద సహాయక చర్యల్లో అప్రమత్తంగా ఉంటున్నారు. మంత్రులందరూ విజయవాడ కలెక్టరేట్‌కు వచ్చి ఎవరికి తోచిన రీతిలో వారు వరద బాధితులకు సాయం చేయడంలో నిమగ్నమయ్యారు. ఆదివారం కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తర్వాత, వివిధ రాష్ట్రాల నుంచి పవర్‌బోట్లు విజయవాడకు చేరుకున్నాయి. ఆ పడవల ద్వారా విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు.


  • రెండు గంటలు మాత్రమే పడుకున్న బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం రాత్రి కేవలం రెండు గంటలు పడుకొన్నారు. సోమవారం తెల్లవారుజాము వరకూ ఆయన విజయవాడ నగరం, చుట్టుపక్కల వరద ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ నగరంలో కొంత భాగం బుడమేరు వరద ముంపునకు తీవ్రంగా ప్రభావితమైన బాధితులకు సహాయం అందడం లేదన్న ఫిర్యాదులు బాగా వస్తుండటంతో ఆదివారం అంతా ఆయన దానిపైనే దృష్టి పెట్టారు.


తాను చెప్పినట్లుగా బాధితులకు ఆహారం అందుతున్నదీ లేనిదీ క్షేత్ర స్థాయిలో పరిశీలించే నిమిత్తం ఆదివారం రాత్రి పదకొండు గంటలకు ఆయన ముంపు ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామ 4 గంటలకు చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకొన్నారు. సరిగ్గా రెండు గంటలు మాత్రం విశ్రాంతి తీసుకొన్న తర్వాత సోమవారం ఉదయం 6 గంటలకు ఆయన లేచి తయారై కలెక్టరేట్‌లో సమీక్షలు ప్రారంభించారు.

Updated Date - Sep 03 , 2024 | 05:28 AM

Advertising
Advertising