ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bandi Sanjay: పౌర సరఫరాల శాఖలో అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలి

ABN, Publish Date - May 26 , 2024 | 04:29 AM

పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. పౌర సరఫరాల శాఖ రూ.50 వేల కోట్ల అప్పులో కూరుకుపోయిందని తెలిపారు.

  • కాంగ్రెస్‌ నేతలకు మిల్లర్ల నుంచి లంచం

  • దోచుకున్న డబ్బు ఢిల్లీకి కప్పం: సంజయ్‌

నల్లగొండ/హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. పౌర సరఫరాల శాఖ రూ.50 వేల కోట్ల అప్పులో కూరుకుపోయిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం నుంచి ఈ శాఖ విషయంలో అదే పంథా కొనసాగుతోందన్నారు. కేసీఆర్‌ కుటుంబం అక్రమ సంపాదనను కూడగట్టుకోగా, కాంగ్రెస్‌ నాయకులు సైతం దోచుకున్న డబ్బును ఢిల్లీకి పంపుతున్నారని విమర్శించారు.


కొంత మంది కాంగ్రెస్‌ నాయకులకు మిల్లర్ల నుంచి ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. కిలో ధాన్యం కోత లేకుండా ఎక్కడా కొనుగోలు చేయడం లేదని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ అక్రమాలపై దృష్టి సారించాలని కోరారు. కొంత మంది రైస్‌ మిల్లుల సంఘం నాయకులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ప్రభుత్వ పెద్దలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. కాగా, కరీంనగర్‌లో హనుమాన్‌ దీక్షాపరుల పట్ల పోలీసుల వ్యవహార శైలిని సంజయ్‌ తీవ్రంగా ఖండించారు. గొడవలు జరిగితే సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలే తప్ప.. వివాదాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేయొద్దని అన్నారు. అరెస్ట్‌ చేసిన స్వాములను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


సీబీఐకి ఫిర్యాదు చేస్తా: ఏలేటి

పౌర సరఫరాల శాఖలో అవినీతి, అక్రమాలపై నిజ నిర్ధారణకు అఖిలపక్ష కమిటీని లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ కమిటీని వేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అవినీతిపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాకు లేఖ రాస్తానని.. సీబీఐకి ఫిర్యాదు చేస్తానని పేర్నొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ధాన్యం రవాణా టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు, మిల్లర్ల మధ్య ఏప్రిల్‌ 18న జల సౌధలో మంత్రి, కమిషనర్‌ సమక్షంలో చేయించిన చీకటి ఒప్పందం ఏంటి..? ఆ ఒప్పందంలో రూ.వంద స్టాంప్‌ పేపర్‌పై బిడ్డర్‌కు, మిల్లర్లకు మధ్య బలవంతంగా ఎంవోయూ చేయించిన మాట వాస్తవం కాదా..? క్వింటా ధాన్యాన్ని రూ.2,223కు రైస్‌ మిల్లరే బిడ్డర్‌ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నట్లుగా ఎంవోయూలో రాయించిన మాట వాస్తవం కాదా..? మిల్లర్ల నుంచి రావాల్సిన రూ.22 వేల కోట్ల బకాయిలను ఎందుకు వసూలు చేయడం లేదు..?’’ అని మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

Updated Date - May 26 , 2024 | 04:29 AM

Advertising
Advertising