ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: బొగ్గు గనులను వేలం వేస్తే ఊరుకోం..

ABN, Publish Date - Jun 21 , 2024 | 04:04 AM

రాష్ట్రంలో సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనులను కేద్ర ప్రభుత్వం వేలం వేస్తే ఊరుకోబోమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. రాష్ట్రం తరఫున పోరాడి తీరతామని స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

  • అఖిలపక్షంతో ప్రధాని వద్దకు వెళతాం

  • శాపంగా మారింది: భట్టి, తుమ్మల

  • సింగరేణిలోని గనులు సంస్థకే ఇవ్వాలి

  • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలి

  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల

ఖమ్మం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాష్ట్రంలో సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనులను కేద్ర ప్రభుత్వం వేలం వేస్తే ఊరుకోబోమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. రాష్ట్రం తరఫున పోరాడి తీరతామని స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొగ్గు గనులన్నీ వేలం వేసేలా 2015లో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి ఆనాడు బీజేపీతో పాటు బీఆర్‌ఎస్‌ కూడా మద్దతు పలికి ఇప్పుడు దొంగాట ఆడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత భవిష్యత్తుకు విఘాతం కలిగించేలా సింగరేణి సంస్థను దెబ్బతీసేందుకు గత కేసీఆర్‌ ప్రభుత్వం ఆనాడు కేంద్ర చట్టానికి మద్దతు పలికిందని ధ్వజమెత్తారు. దీన్ని వ్యతిరేకిస్తూ తాను కాంగ్రెస్‌ తరఫున లేఖ రాసినట్లు భట్టి గుర్తు చేశారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం సింగరేణి పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు గనులను కేసీఆర్‌కు సంబంధం ఉన్న కంపెనీలకు అప్పగించిందని ఆరోపించారు. సింగరేణికే ఈ ప్రాంత బొగ్గు గనులను కేటాయించాలంటూ అఖిలపక్షంతో వెళ్లి ప్రధానమంత్రిని కోరతామని తెలిపారు. ఇందుకు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రం తరఫున చొరవ తీసుకోవాలని కోరారు.


సింగరేణి పరిధిలో ఉన్న అన్ని బొగ్గు బ్లాకులను సంస్థకే కేటాయించాలని శుక్రవారం కిషన్‌రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న గనుల్లో 2033 వరకే బొగ్గును తవ్వుకునే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత సింగరేణి మూతపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను కేటాయించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే తాము కేంద్రంతో పోరాడి తీరతామన్నారు. అవసరమైతే గత చట్టంలో మార్పులు చేసుకోవాలని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇందుకు సహకరించాలని కోరారు. గోదావరి లోయలోని బొగ్గు నిక్షేపాలను సింగరేణికి కేటాయించకుండా గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ సర్కారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేటు సంస్థలకు టెండర్లు అప్పగించారని భట్టి ఆరోపించారు.


వారికి సన్నిహితమైన ఆరో, అవంతిక, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలకు దక్కేలా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. వాస్తవాలను పక్కనపెట్టి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ సింగరేణి కార్మికులను, ప్రజలను పక్కదారి పట్టించేదుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గత పదేళ్లలో సింగరేణి సంస్థను ఎలా దెబ్బతీశారో, కార్మికుల సంఖ్య ఎలా కుదించారో అందరికీ తెలుసన్నారు. సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు ఉమ్మడి వ్యూహంతోనే 2015లో బొగ్గు గనులన్నింటినీ వేలం వేసేలా చట్టాన్ని రూపొందించాయని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సిగరేణిని కాపాడుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.


గనులతో మాకు సంబంధం లేదు: ప్రతిమ

హైదరాబాద్‌: సత్తుపల్లి బొగ్గు గనిని తాము దక్కించుకున్నట్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను ప్రతిమ ఇన్‌ఫ్రా తీవ్రంగా ఖండించింది. సింగరేణితో తమకెలాంటి సంబంఽధాలు లేవని ప్రతిమ ఇన్‌ఫ్రా ఉపాధ్యక్షుడు పి.అనిల్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Jun 21 , 2024 | 04:04 AM

Advertising
Advertising