Share News

Loksabha polls: కేసీఆర్‌ను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపడం ఖాయం: రఘునందన్‌ రావు

ABN , Publish Date - May 08 , 2024 | 03:21 PM

Telangana: బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ నయా నాటకాలకు తెర లేపుతున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రఘు నందన్ రావు దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని అన్నారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్‌కు సిగ్గు ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకట్ రాంరెడ్డి ఎన్ని కట్టలు కట్టించినందుకు మెదక్ సీటు ఇచ్చావ్ కేసీఆర్ అని నిలదీశారు.

Loksabha polls: కేసీఆర్‌ను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపడం ఖాయం: రఘునందన్‌ రావు
BJP MP Candidate Raghunandan Rao

సిద్దిపేట, మే 8: బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ (BRS Chief KCR) నయా నాటకాలకు తెర లేపుతున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు (BJP MP Candidate Raghunandan Rao) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రఘు నందన్ రావు దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని అన్నారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్‌కు సిగ్గు ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకట్ రాంరెడ్డి ఎన్ని కట్టలు కట్టించినందుకు మెదక్ సీటు ఇచ్చావ్ కేసీఆర్ అని నిలదీశారు. కేసీఆర్ డబ్బులు ఇచ్చి గెలిచారని రాధ కిషన్ రావు చెప్పలేదా అని ప్రశ్నించారు. ‘‘దుబ్బాక బై ఎన్నికల్లో నిన్ను, నీ అల్లున్ని కొట్టలేదా కేసీఆర్’’ అంటూ నిలదీశారు. సిద్దిపేట జిల్లాలలో వంద మంది తనలాంటి జీవితాలను కేసీఆర్ ఆగం చేశారని మండిపడ్డారు. మెదక్‌తో కేసీఆర్‌కు పేగు బంధం ఉన్నదని సెంటిమెంట్ పండిస్తున్నారన్నారు.

AP Elections: అందుకే నారా కుటుంబం ప్రజాక్షేత్రంలోకి రాక తప్పలేదు: భువనేశ్వరి


కేసీఆర్‌కు తెలంగాణ పౌరుషం ఉంటే డబ్బులు పంచలేదని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్‌లో పనిచేసిన నాయకులకు కేసీఆర్ ఎందుకు టికెట్ ఇవ్వలేదని అడిగారు. కేసీఆర్ కామారెడ్డిలో, కూతురు నిజామాబాద్‌లో చెల్లలేదని.. కొడుకు ఎంపీగా పోటీకి ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్, హరీష్ రావుః‌కు వెంకట్ రాంరెడ్డి బినామీ కాదని చెప్పాలని డిమాండ్ చేవఆరు. కేసీఆర్‌కు వెంకట్ రాంరెడ్డి ముద్దు అయితే శ్రీకాంత్ చారి తల్లికి ఎందుకు సీటు ఇవ్వలేదన్నారు. ‘‘రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలవడం ఖాయం... మిమ్మల్ని శ్రీ కృష్ణ జన్మస్థలంకు పంపడం ఖాయం’’ అని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

Updated Date - May 08 , 2024 | 03:30 PM