ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: సర్కారు జాబ్‌ క్యాలెండర్‌ బోగస్‌!

ABN, Publish Date - Aug 03 , 2024 | 04:31 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతను మభ్యపెడుతోందని.. నిరుద్యోగులకు భయపడి, నాలుగు కాగితాల మీద ఏది పడితే అది రాసుకొచ్చి జాబ్‌ క్యాలెండర్‌ అని ప్రకటించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

  • రాహుల్‌కు, రేవంత్‌కు అశోక్‌నగర్‌ వచ్చే దమ్ముందా?

  • అక్కడికొస్తే నిరుద్యోగులు వారిద్దరినీ తన్ని తరిమేస్తరు

  • శాడిస్ట్‌ సీఎం.. బజారుభాష మాట్లాడిస్తున్నరు: కేటీఆర్‌

  • శాసనసభ దుశ్శాసన సభగా మారింది: హరీశ్‌

  • గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

  • అరెస్ట్‌ చేసి తెలంగాణభవన్‌కు తరలించిన పోలీసులు

  • గన్‌పార్క్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతను మభ్యపెడుతోందని.. నిరుద్యోగులకు భయపడి, నాలుగు కాగితాల మీద ఏది పడితే అది రాసుకొచ్చి జాబ్‌ క్యాలెండర్‌ అని ప్రకటించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ‘ప్రభుత్వం ప్రటించిన జాబ్‌ క్యాలెండర్‌ బోగస్‌’ అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గన్‌పార్కు వద్ద ఽనిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాబ్‌ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య పెట్టలేదని.. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని అడిగితే రెండు నిమిషాలు కూడా టైమ్‌ ఇవ్వలేదని కేటీఆర్‌ మండిపడ్డారు. ‘‘ఈ సమయంలో రాహుల్‌, రేవంత్‌ అశోక్‌నగర్‌కు రాగలరా? వచ్చే దమ్ముందా?’’ అని సవాల్‌ విసిరారు.


వారిద్దరూ అశోక్‌నగర్‌కు వస్తే యువత తన్ని తరిమేందుకు సిద్ధంగా ఉందన్నారు. ‘‘ఈ శాడిస్ట్‌ ముఖ్యమంత్రి అందరినీ ఉసిగొలుపుతూ బజారు భాష మాట్లాడిస్తూ పైశాచికానందం పొందుతున్నారు. ఇంత దిగజారుడు, దివాలాకోరు సీఎంను ఎప్పుడూ చూడలేద’’అని అన్నారు. తెలంగాణ యువత తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇంత బజారు భాషలో తిట్టిస్తారా? అని ఆవేదన వెలిబుచ్చారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న వ్యక్తికి మైక్‌ ఇచ్చి మరీ తిట్టించారని ధ్వజమెత్తారు. తెలంగాణ శాసనసభ దుశ్శాసన సభగా మారిందని, ఇందిరమ్మ రాజ్యం అంటూనే కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళల గౌరవానికి భంగం కలిగిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. సభా నాయకుడే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తిట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. దానం నాగేందర్‌ మాట్లాడిన భాష రౌడీషీటర్‌ మాట్లాడే భాషలా ఉందని దుయ్యబట్టారు.


‘‘గురువారం అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించారు. శుక్రవారం దానం నాగేందర్‌ వ్యాఖ్యలు.. కన్నతల్లులను అవమానపరిచే విధంగా ఉన్నాయి. మాతృత్వం విలువ తెలియని వారే ఇలా మాట్లాడుతారు’’ అని మండిపడ్డారు. ఆయన సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బజారు భాష మాట్లాడిన ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసిన అక్బరుద్దీన్‌ ఓవైసీకి ఆయన ధన్యవాదాలు. తెలిపారు. ‘‘హైదరాబాద్‌ ఏమైనా దానం నాగేందర్‌ జాగీరా.. అసెంబ్లీలోనే ఇలా మాట్లాడితే.. ఇక్కడికి పెట్టుబడులు ఎలా వస్తాయ’’ని ప్రశ్నించిన హరీశ్‌.. శాసనసభ చరిత్రలోనే ఇది చీకటిరోజని పేర్కొన్నారు.


నిరసనలో.. ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబిత, కోవ లక్ష్మితోపాటు పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి తెలంగాణ భవన్‌కు తరలించారు. కాగా.. తెలంగాణభవన్‌లో నిరుద్యోగులతో కలిసి మీడియాతో మాట్లాడిన హరీశ్‌.. ‘అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ అయినా ఇచ్చావా రేవంత్‌? తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట ఏంచేశావ్‌?’ అని నిలదీశారు. జాబ్‌క్యాలెండర్‌లో పేరు, సంతకం లేవని.. ఓ చిత్తు కాగితంలా దాన్ని ప్రకటించారని మండిపడ్డారు.

Updated Date - Aug 03 , 2024 | 04:31 AM

Advertising
Advertising
<