ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: అసెంబ్లీలో మహిళల పట్ల సీఎం తీరు సరికాదు

ABN, Publish Date - Aug 02 , 2024 | 04:07 AM

అసెంబ్లీలో తమను సీఎం రేవంత్‌ రెడ్డి ఉద్దేశపూర్వకంగా విమర్శించారని, మహిళల పట్ల ఆయన తీరు సరికాదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.

  • సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో తమను సీఎం రేవంత్‌ రెడ్డి ఉద్దేశపూర్వకంగా విమర్శించారని, మహిళల పట్ల ఆయన తీరు సరికాదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం మరో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. కుటుంబ యజమాని హత్యకు గురైతే తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చామని, తాము ఎవరినీ మోసం చేయలేదన్నారు. ‘పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న నువ్వు కూడా నిన్ను నమ్మిన రాహుల్‌ గాంధీ బతుకును సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేస్తావా?’ అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.


సీఎం రేవంత్‌ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని, ఆయన తాలిబన్ల సంస్కృతికి వారసుడిలా కనబడుతున్నారని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేలు నాలుగున్నర గంటలు నిలబడినా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. కాగా, అసెంబ్లీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి బీజేపీ గొంతు నొక్కేశాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ ఇతర సభ్యులకు మాట్లాడే అవకాశం రాకుండా బీఅర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేశారన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 04:07 AM

Advertising
Advertising
<