ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Political Conflict: హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా కుట్ర..

ABN, Publish Date - Sep 14 , 2024 | 03:54 AM

హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

  • అందుకే బీఆర్‌ఎస్‌ నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు

  • కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను హరీశ్‌, కేటీఆర్‌ ఎందుకు ఖండించట్లేదు..?

  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఆగ్రహం..

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆంధ్రా సెటిలర్లపై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌, హరీశ్‌రావులు ఎందుకు ఖండించ లేదంటూ నిలదీశారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరారు. శుక్రవారం సీఎల్పీ మీడియా హాల్లో పార్టీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మేఘారెడ్డి, నాగరాజు, చిక్కుడు వంశీకృష్ణ, మేడిపల్లి సత్యంలతో కలిసి రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు.


‘మహిళలను కించపరుస్తూ మొదట మాట్లాడింది.. గాంధీ ఇంటికి వస్తానని రెచ్చగొట్టిందీ కౌశిక్‌రెడ్డే.. కేటీఆర్‌, హరీశ్‌ల దుర్మార్గ ఆలోచనల్లో భాగంగానే కౌశిక్‌ మాట్లాడారు. పీఏసీ పదవిని ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్ష పార్టీకే ఇచ్చాం. డీజీపీని రాజకీయాల్లోకి లాగడం అనైతికం. ఆయనకు బీఆర్‌ఎస్‌ నేతలు క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌రెడ్డిని వెంటనే బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. కౌశిక్‌రెడ్డిని ముందు పెట్టి హరీశ్‌ రాజకీయం చేస్తుంటే.. అమెరికాలో ఉండి ట్వీట్లు పెడుతూ హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని కేటీఆర్‌ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరాజు మాట్లాడుతూ.. హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు పోలీసులు భయపడబోరని, చట్టపరంగా వ్యవహరిస్తారన్నారు.


  • కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటు వేయండి..

మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కాంగ్రెస్‌ మహిళా నేతలు కోరారు. ఈ మేరకు మంత్రుల క్వార్టర్స్‌లోని స్పీకర్‌ నివాసంలో ప్రసాద్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

Updated Date - Sep 14 , 2024 | 03:54 AM

Advertising
Advertising