ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Patancheru: స్టాక్‌ మార్కెట్‌ పేరుతో.. 2.43 కోట్లకు టోకరా

ABN, Publish Date - Aug 04 , 2024 | 04:32 AM

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ టెకీకి రూ.2.43 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఉదంతమిది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీఆర్‌ కాలనీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జూన్‌ 19న స్టాక్‌ మార్కెట్‌, ఇన్వె్‌స్టమెంట్‌కు సంబంధించి ఫేస్‌బుక్‌లో కనిపించిన ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు.

  • టెకీకి సైబర్‌ నేరగాళ్ల వల

  • రూ.28 లక్షలను వెనక్కి రప్పించిన పోలీసులు

పటాన్‌చెరు, ఆగస్టు 3: స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ టెకీకి రూ.2.43 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఉదంతమిది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీఆర్‌ కాలనీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జూన్‌ 19న స్టాక్‌ మార్కెట్‌, ఇన్వె్‌స్టమెంట్‌కు సంబంధించి ఫేస్‌బుక్‌లో కనిపించిన ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. అందులో చూపిన లింకును క్లిక్‌ చేయగా.. సైబర్‌ నేరగాళ్లు లైన్‌లోకి వచ్చి.. ‘మోతీలాల్‌ ఓస్వాల్‌ స్ట్రాటజీ’ అనే పేరుతో ఉన్న గ్రూప్‌లో యాడ్‌ చేశారు. వారు సూచించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న సదరు టెకీ.. తొలుత కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టారు.


లాభాలు వస్తున్నట్లు సైబర్‌ నేరగాళ్లు చూపడంతో.. 22 సార్లు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.2.43 కోట్లను బదిలీ చేశాడు. రూ.6 కోట్ల మేర లాభం వచ్చినట్లు యాప్‌లో చూపుతుండడంతో.. విత్‌డ్రాకు ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో సైబర్‌ నేరగాళ్లకు విషయం చెప్పి.. సమస్యను పరిష్కరించాలని కోరాడు. వారు కుంటిసాకులు చెబుతుండడంతో.. మోసం జరిగిందని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారీ మోసం కావడంతో కేసును సైబర్‌ క్రైమ్‌ సెల్‌కు బదిలీ చేశామని, సైబర్‌ కేటుగాళ్ల ఖాతా నుంచి రూ.28 లక్షలను వెనక్కి రప్పించామని ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

Updated Date - Aug 04 , 2024 | 04:32 AM

Advertising
Advertising
<