ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: ‘ఆ ఉద్యోగులు ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు’.. సంగారెడ్డి ఘటనపై జేఏసీ మాజీ చీఫ్ వివరణ

ABN, Publish Date - Apr 10 , 2024 | 10:26 AM

Telangana: సిద్దిపేటలో రాజకీయ సమావేశంలో పాల్గొన్నారంటూ ఉద్యోగులను సస్పెండ్ చేసిన అంశంపై ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షులు దేవీప్రసాద్ స్పందించారు. ఉద్యోగుల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండించారు. రాజకీయ సమావేశంలో పాల్గొన్నారన్న నెపంతో 106 చిన్న తరగతి ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. తమ సమస్యలపై చర్చించుకోవడానికి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి వెళ్లి ఎన్నికల్లో ఓట్ చేయాలని కోరారని వివరించారు.

సంగారెడ్డి, ఏప్రిల్ 10: సిద్దిపేటలో రాజకీయ సమావేశంలో పాల్గొన్నారంటూ ఉద్యోగులను (Telangana Employees) సస్పెండ్ చేసిన అంశంపై ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షులు దేవీప్రసాద్ స్పందించారు. ఉద్యోగుల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండించారు. రాజకీయ సమావేశంలో పాల్గొన్నారన్న నెపంతో 106 చిన్న తరగతి ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. తమ సమస్యలపై చర్చించుకోవడానికి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి (BRS candidate Venkatram Reddy) వెళ్లి ఎన్నికల్లో ఓట్ చేయాలని కోరారని వివరించారు. దీనిని సహించలేని బీజేపీ, కాంగ్రెస్, పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం దారుణమని మండిపడ్డారు. ఓటర్స్ అందరిని ఏ రాజకీయ పార్టీ అయినా తమ ప్రచార కార్యక్రమంలో భాగంగా కలవడం ఎన్నికల్లో సహజమైన ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు ఎన్నికల ప్రచారం నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఆ సమావేశం ఎన్నికల కోసం నిర్వహించింది కాదన్నారు.

Nitish Reddy: తన స్ట్రాటజీని బయటపెట్టిన నితీశ్.. పెద్ద ప్లానింగే ఇది!


ఎన్నికల ముందు ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసే దివాలకోరు రాజకీయాలకు తెర లేపిన బీజేపీ, కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి ఉద్యోగులపై నిజానిజాలు నిగ్గు తేల్చి, ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని కోరారు. ఇలాంటి చర్యల వలన ఉద్యోగులలో అభద్రతా భావం ఏర్పడి అభివృద్ధి సంక్షేమంపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం కూడా ఉందని దేవిప్రసాద్ పేర్కొన్నారు.


అసలేం జరిగిందంటే...

సిద్ధిపేటలోని ఓ ఫంక్షన్‌లో రెండు రోజుల క్రితం సెర్ప్, ఈజీఎస్ ఉద్యోగులతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశమయ్యారంటూ ఈసీకి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సమాచారం అందించారు. వెంటనే ఈసీ, పోలీసులు అక్కడకు చేరుకుని ఫంక్షన్‌ హాల్‌లో సీసీ ఫుటేజ్‌ను సేకరించారు. మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారంటూ దాదాపు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కలెక్టర్ వేటు వేశారు. 38 మంది సెర్ప్ ఉద్యోగుల్లో 14 ఎపీఎంలు, 18 మంది సీసీలు, 4 గురు వీవోలు, ఒక్కరు సీఓ, ఒక్కరు సీబీ ఆడిటర్స్, అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగుల్లో 4 మంది ఏపీఎంలు, 7 ఈసీలు, 38 మంది టీఏలు, 18 మంది సీఓలు, ఒక్కరు ఎఫ్‌ఏలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి నిన్న(మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

Crime.. సంగారెడ్డి జిల్లాలో యువతి అదృశ్యం..

Telangana Politics: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తిర పరిణామం.. సీన్ రిపీట్ అయ్యేనా!?


మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 10 , 2024 | 11:01 AM

Advertising
Advertising