Loksabha polls 2024: వెంకట్రామిరెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారు.. బీజేపీ అభ్యర్థిపై హరీష్ ఫైర్
ABN, Publish Date - May 01 , 2024 | 03:52 PM
Telangana: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోనీ 35,36 వార్డులలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట, మే 1: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై (BJP Candidate Raghunandan Rao) మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోనీ 35,36 వార్డులలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. వెంకట్రామిరెడ్డిపైన రఘునందన్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గ్లోబల్స్ ప్రచారం చేసి గెలవడం రఘునందన్ రావుకు అలవాటని వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: చిరంజీవిని అవమానిస్తారా?.. జగన్‌కు టైం దగ్గరపడింది...
వెంకట్రామిరెడ్డి పైన ఒక దొంగ వీడియో క్రియేట్ చేసి ఆయన పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వెంకట్రాం రెడ్డి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అని.. మచ్చలేని మంచి మనిషి అని అన్నారు. రాజకీయాల్లోకి అందరు వచ్చి డబ్బులు సంపాదించుకుంటారు కానీ వెంకట్రాంరెడ్డి తన సొంత డబ్బులు పెట్టి సేవ చేస్తా అంటున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీ వాళ్లు మరింత ఫేక్ వీడియోలు తయారు చేసే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ప్రజలు నమ్మవద్దని కోరారు. ఎన్నికల కమిషన్‌కు, పోలీస్ స్టేషన్లో కూడా తప్పుడు ప్రచారాలపై ఫిర్యాదు చేస్తామని హరీష్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth: తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది ‘గాడిద గుడ్డు’.. రేవంత్ ట్వీట్
AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 01 , 2024 | 04:01 PM