ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nalgonda: మా ఊర్లో సగం ఇళ్లకే భగీరథ నీళ్లు ..

ABN, Publish Date - Jun 23 , 2024 | 04:41 AM

తన సొంత గ్రామంలో మిషన్‌ భగీరథ నీళ్లు సగం ఇళ్లకే వస్తున్నాయని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జరిగిన నల్లగొండ జడ్పీ సర్వసభ్య చివరి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

  • తాగునీరు అందక ప్రజల ఇబ్బందులు: గుత్తా

  • మా ఊర్లోనూ అదే పరిస్థితి: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, జూన్‌ 22: తన సొంత గ్రామంలో మిషన్‌ భగీరథ నీళ్లు సగం ఇళ్లకే వస్తున్నాయని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జరిగిన నల్లగొండ జడ్పీ సర్వసభ్య చివరి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్లలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తాను అనేకమార్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. మిషన్‌ భగీరథ పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల బిల్లులు రాష్ట్రంలో రూ.400 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసిందని, వెంటనే చిన్న కాంట్రాక్టర్లకైనా బిల్లులు చెల్లించాలని సూచించారు.


అంతకు ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో మిషన్‌ భగీరథ ప్రాజెక్టు కోసం 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సగం ఇళ్లకు నీళ్లు రావడం లేదని, కనీసం తన స్వగ్రామం బ్రాహ్మణవెల్లెంలలోనూ అన్ని ఇళ్లకు నీళ్లు రావడం లేదని అన్నారు. ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతమైన నల్లగొండను ఫ్లోరైడ్‌ రహిత జిల్లాగా మార్చడం కోసం గత ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పనులు పూర్తిగా వృథా అయ్యాయని విమర్శించారు. ఏ గ్రామంలోకి వెళ్లినా నీళ్లు రావడం లేదని ప్రజలు చెబుతున్నారని, పలుచోట్ల బోరు నీళ్లు, కృష్ణా జలాలు కలిపి ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన తేదీ వారం పదిరోజుల్లో ఖరారవుతుందని అన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 04:41 AM

Advertising
Advertising