ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: ఆల్మట్టికి 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ABN, Publish Date - Jul 09 , 2024 | 04:24 AM

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు క్రమంగా వర ద పెరుగుతోంది. బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి వరద పోటెత్తుతోం ది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా సోమవారం 60,603 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదైంది.

  • మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. కృష్ణా ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద..

  • ఇటు మేడిగడ్డకు 23,260 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 10.6 సెం.మీ. వర్షపాతం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు క్రమంగా వర ద పెరుగుతోంది. బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి వరద పోటెత్తుతోం ది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా సోమవారం 60,603 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదైంది. దీంతో నీటి నిల్వ 66.54 టీఎంసీలకు చేరింది. తుంగభద్రకు కూడా భారీగా వరద పెరుగుతోంది. తుంగభద్ర జలాశయం పూర్తి సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30,338 క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో నిల్వ 20.85 టీఎంసీలకు చేరుకుంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటం, కృష్ణానదికి వరదలు మొదలవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదలు ఇలాగే కొనసాగితే అల్మట్టి, నారాయణపూర్‌, తుంగభద్ర నిండి మరో ఐదు రోజుల్లో రాష్ట్రంలోకి కృష్ణమ్మ అడుగుపెట్టే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. జూరాలకు 2,501 క్యూసెక్కులు, శ్రీశైలానికి 443, నాగార్జునసాగర్‌కు 947 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.


మేడిగడ్డకు కొనసాగుతున్న వరద..

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7 ఎగువన నిర్మించిన తాత్కాలిక కాఫర్‌డ్యాం తొలగింపు పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఇక బ్యారేజీలోకి వరద కొనసాగుతోం ది. సోమవారం 23,260 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రా జెక్టుకు 3,414 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.


ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌లలో భారీ వర్షాలు

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షా లు, నిజామాబాద్‌ జిల్లాలో మోస్తరు వానలు కురిశాయి. పలుచోట్ల వాగులు పొంగిపొర్లాయి. ఇళ్లలోకి వరద చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 10.6 సెం.మీ, జైనథ్‌లో 7.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కుంటాల, పొచ్చెర జలపాతాలు పరవళ్లు పెడుతున్నాయి. కెరమెరి మండలంలోని కెలి(బి), సాంగ్విల మధ్య ఉన్న లోలెవల్‌ వంతెన పైనుంచి వరద నీరు ఉప్పొంగి రాకపోకలకు నిలిచిపోయాయి.

Updated Date - Jul 09 , 2024 | 04:24 AM

Advertising
Advertising
<