Share News

Hyderabad: మత్తు.. యువత చిత్తు...

ABN , Publish Date - Aug 03 , 2024 | 01:46 PM

ప్రైవేట్‌ హాస్టళ్లలోని(Private hostels) కొంతమంది యువకులు డ్రగ్స్‌, గంజాయి మత్తులో ఇష్టారీతిన ప్రవర్తిస్తూ స్థానికులను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులు దృష్టి సారించకపోవడంతో వారి వ్యవహారం ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా సాగుతోంది. ఇదేంటని ప్రశ్నిస్తే చంపడానికి కూడా వెనకాడని పరిస్థితి.

Hyderabad: మత్తు.. యువత చిత్తు...

- హాస్టళ్లపై తగ్గిన పోలీసుల నజర్‌

- పరిసరాల్లో గంజాయి, డ్రగ్స్‌ మత్తులో జోగుతున్న యువకులు

- డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడుతున్న వైనం

- హాస్టళ్లలో పనిచేయని సీసీ కెమెరాలు

- ఇటీవల ఉపాధ్యాయుడి దారుణ హత్య

హైదరాబాద్: ప్రైవేట్‌ హాస్టళ్లలోని(Private hostels) కొంతమంది యువకులు డ్రగ్స్‌, గంజాయి మత్తులో ఇష్టారీతిన ప్రవర్తిస్తూ స్థానికులను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులు దృష్టి సారించకపోవడంతో వారి వ్యవహారం ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా సాగుతోంది. ఇదేంటని ప్రశ్నిస్తే చంపడానికి కూడా వెనకాడని పరిస్థితి. ఎస్‌ఆర్‌ నగర్‌, బల్కంపేట, అమీర్‌పేట(SR Nagar, Balkampet, Ameerpet)లో ఉన్న హాస్టళ్లపై స్థానిక పోలీసులు పెద్దగా నజర్‌ పెట్టడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. హాస్టళ్లలో సగానికిపైగా వాటిలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు.

ఇదికూడా చదవండి: Hyderabad: రాత్రి ఒంటిగంట వరకూ ఓకే..


నిర్వాహకులు విద్యార్థుల నుంచి నెలనెల డబ్బులు వసూలు చేస్తున్నారే తప్ప, హాస్టల్‌ గదుల్లో ఏం జరుగుతుందనే అనే దానిపై మాత్రం దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు యువకులు తాగి వచ్చి ప్రతిరోజూ గొడవ చేస్తున్నాడని అమీర్‌పేటలో హనుమ యోగాలక్ష్మీ అన్నపూర్ణ బాయిస్‌ హాస్టల్‌ నిర్వాహకుడికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కర్నూల్‌కు చెందిన వెంకటరమణ ప్రశ్నించడంతో ఏలూరు వాసి గణేశ్‌, గడ్డం గీసుకునే కత్తితో విచక్షణ రహితంగా దాడిచేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.


డ్రగ్స్‌తో దొరికిన యువకులు...

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం సందర్బంగా పోలీసులు చేసిన తనిఖీల్లో గంజాయి, డ్రగ్స్‌తో ఆరుగురు యువకులు పట్టుపడ్డారు. అలాగే ఇటీవల ఎస్‌ఆర్‌ నగర్‌ బస్టా్‌పలో డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు యాంటీ నార్కొటిక్‌ డ్రగ్స్‌ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కొంతమంది యువకులు రాత్రి, పగలు తేడా లేకుండా గంజాయి సేవిస్తూ అల్లర్లకు పాల్పడుతున్నారు. బల్కంపేట శ్మశానవాటిక, బాపునగర్‌, ఈఎస్ఐ, ఎస్‌ఆర్‌నగర్‌(Bapunagar, ESI, SRnagar), పోలీస్‌ స్టేషన్‌ వెనుక వీధుల్లో రాత్రివేళ యథేచ్ఛగా గంజాయి, హ్యాష్‌ ఆయిల్‌ సేవిస్తున్నారు.


పోలీస్‌ పెట్రోలింగ్‌ అంతంతా మాత్రంగా నిర్వహిస్తుండడంతో బల్కంపేట శ్మశాన వాటిక వద్ద మత్తులో ఊగుతూ ప్రకృతి చికిత్సాలయం వద్ద ఎంఎంటీస్‌ రైలు దిగి వస్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ బయబ్రాంతులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బంజారాహిల్స్‌ పబ్‌(Banjara Hills Pub)లో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న అధికారులు పట్టుబడిన వారిలో కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఆర్‌నగర్‌లోని వెంకట్‌ అనే హాస్టళ్లో డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో శుక్రవారం తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుని నలుగురు యువకులను అరెస్ట్‌ చేశారు. ఇకనైన పోలీసు లు డ్రగ్స్‌, గంజాయి విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశాలు ఇవ్వాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 03 , 2024 | 01:19 PM

Updated Date - Aug 03 , 2024 | 01:46 PM