Share News

Hyderabad: రాత్రి ఒంటిగంట వరకూ ఓకే..

ABN , Publish Date - Aug 03 , 2024 | 01:19 PM

నగరంలో రాత్రి 11 దాటితే చాలు.. ఏదైనా తినాలన్నా, కనీసం టీ తాగాలన్నా.. కష్టంగా మారిపోయింది. రాజధానిలో రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారికి ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. పోలీసులు హోటళ్లు, రెస్టారెంట్లను(Hotels and restaurants) మూసివేయిస్తుండడంతో కొన్ని నెలలుగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది.

Hyderabad: రాత్రి ఒంటిగంట వరకూ ఓకే..

- హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణకు అవకాశం

- వైన్‌షాపులకు నో చాన్స్‌

- అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: నగరంలో రాత్రి 11 దాటితే చాలు.. ఏదైనా తినాలన్నా, కనీసం టీ తాగాలన్నా.. కష్టంగా మారిపోయింది. రాజధానిలో రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారికి ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. పోలీసులు హోటళ్లు, రెస్టారెంట్లను(Hotels and restaurants) మూసివేయిస్తుండడంతో కొన్ని నెలలుగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది. నగరంలో రాత్రిపూట ఒంటిగంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లను నడుపుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) అసెంబ్లీలో ప్రకటించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..


ఓల్డ్‌సిటీ(Old City) నుంచి మొదలుకుని ఇతర ప్రాంతాల్లోనూ రాత్రి 11దాటిన తరువాత టిఫిన్‌ చేయాలన్నా, హోటల్‌కు వెళ్లాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పోలీసులు కూడా ఇబ్బందులు పెడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన స్పందించారు. మద్యం దుకాణాలను మినహా ఏ వ్యాపారమైనా ఒంటి గంట వరకు నడిపించుకోవచ్చని స్పష్టం చేశారు.

city7.jpg


అయితే, వైన్‌షాపు(Wineshop)లకు ఆ అవకాశం ఇస్తే ఇబ్బందులుంటాయని తెలిపారు. ఈమేరకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల(Hyderabad, Cyberabad and Rachakonda Commissionerates) పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి ఒంటి గంట వరకు కూడా తెరుచుకోనున్నాయి.


దికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 03 , 2024 | 01:19 PM