Share News

Travel Trends: లాంగ్‌ వీకెండ్‌కు పోదాం చలోచలో..!

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:47 AM

ఈ నెల 15తో మొదలయ్యే ఎక్స్‌టెండెడ్‌ లాంగ్‌ వీకెండ్‌ కోసం హైదరాబాద్‌వాసులు సిద్ధమైపోయారు. దీంతోపాటు నెలాఖరులో వచ్చే మరో సుదీర్ఘ వీకెండ్‌ కోసం యాత్రా ప్రేమికులు రెడీ అవుతున్నారు.

Travel Trends: లాంగ్‌ వీకెండ్‌కు పోదాం చలోచలో..!

  • సుదీర్ఘ వారాంతంతో యాత్రలకు సిద్ధమైన హైదరాబాదీవాసులు

  • ఈ ఆగస్టు 15 వారాంతం కోసం సొంత ఊళ్లకు వెళ్తున్న జనం..

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 15తో మొదలయ్యే ఎక్స్‌టెండెడ్‌ లాంగ్‌ వీకెండ్‌ కోసం హైదరాబాద్‌వాసులు సిద్ధమైపోయారు. దీంతోపాటు నెలాఖరులో వచ్చే మరో సుదీర్ఘ వీకెండ్‌ కోసం యాత్రా ప్రేమికులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్‌ల పరంగా తాము ఈ వీకెండ్‌తో పోలిస్తే రాబోయే వీకెండ్‌ కోసం 29ు వృద్ధిని చూశామని రెడ్‌బస్‌ చెబుతోంది. ఎస్‌ఓటీసీ, థామ్‌సకుక్‌ లాంటి ట్రావెల్‌ ఏజెన్సీలు ఎంక్వైరీలు బాగున్నాయంటున్నాయి. అయితే దేశీయంగా పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఖర్చుతోనే దాదాపుగా ఇతర దేశాలకూ వెళ్లి వచ్చేలా ప్రణాళిక చేసుకున్న వారు కాస్త నిరాశపడేలా విమాన టికెట్ల ధరలు పెరిగాయి.


సాధారణ గమ్యస్థానాలకు కనీసం 10శాతం పెరిగితే టూరి్‌స్టలు ఇష్టపడే గోవాకు 40శాతానికి పైగా, కాశ్మీర్‌లాంటి ఆకర్షణీయ హిల్‌ స్టేషన్స్‌కు 80శాతం వరకూ విమాన చార్జీలు ఈ లాంగ్‌ వీకెండ్‌కు పెరిగాయని పలు ట్రావెల్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. కాగా గురువారం ఆగస్టు 15, శుక్రవారం వరలక్ష్మి వ్రతం (కొందరికి ఆప్షనల్‌ హాలీడే లేదంటే సెలవు పెట్టుకోవాలి), ఐటీ ఉద్యోగులకు శనివారం సెలవు (ఇతరులు సెలవు తీసుకుంటే), ఆదివారం తర్వాత రక్షాబంధన్‌ సోమవారం రావడంతో ఆగస్టు 19 వరకూ సెలవులను ఆస్వాదించవచ్చు.


కొందరు ఆగస్టు 20న పార్శీ న్యూ ఇయర్‌ కాబట్టి ఆప్షనల్‌ హాలీడే తీసుకునే అవకాశమూ చూస్తున్నారు. దాదాపు ఐదు రోజులు సెలవులు ఉండటంతో సాఫ్ట్‌వేర్‌ తదితర రంగాలల్లోని యువత టూర్‌లకు సిద్ధమైంది. దాదాపు ఐదు రోజులు సెలవు వస్తే ఎందుకు ఇక్కడ ఉంటామంటున్నారు ఆంధ్రాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు నికేష్‌, తరుణ్‌. బస్‌ బుకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ రెడ్‌బస్‌ అధ్యయనం ఇదే చెబుతుంది.


ఆగస్టు 17 నుంచి 19 వరకు ట్రావెల్‌ బుకింగ్‌ పరంగా వృద్ధి ఇప్పటికే గణనీయంగా కనిపిస్తోందని ఈ సంస్థ పేర్కొంది. తెలుగురాష్ట్రాల్లో బుకింగ్స్‌ పరంగా 29ు వృద్ధి తమ ప్లాట్‌ఫామ్‌పై ఉన్నట్టు తెలిపింది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి రూట్లలో హైదరాబాద్‌ నుంచి డిమాండ్‌ అధికంగా ఉందని, బెంగళూరు, పుణెలకు డిమాండ్‌ అధికంగా ఉందని పేర్కొంది. ఆగస్టు 24 నుంచి 26 వరకూ మరో లాంగ్‌ వీకెండ్‌ రావడంతో కొందరు మినీకేషన్స్‌ ప్రణాళిక చేసుకుంటున్నారు.


  • డిమాండ్‌ బాగుంది....

సుదీర్ఘ వారాంతంరావడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఈసారి చాలా మంది నగరం విడిచి వెళ్లబోతున్నారంటున్నాయి పలు ట్రావెల్‌ ఏజెన్సీలు. గతంతో పోలిస్తే ఈ లాంగ్‌ వీకెండ్‌ కోసం బుకింగ్‌ల పరంగా 60ు వృద్ధి కనిపిస్తున్నాయంటున్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐజిగో.... బాలీ, అజర్‌బైజన్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ లాంటి ప్రాంతాలకు బుకింగ్‌ 60-70ు పెరిగాయంటోంది. ఎస్‌ఓటీసీ, థామ్‌సకుక్‌ లాంటి సంస్థలు ఆగస్టు 15తో ప్రారంభమయ్యే లాంగ్‌ ఎక్స్‌టెండెడ్‌ వీకెండ్‌ కోసం బుకింగ్‌లు బాగా జరుగుతున్నాయని తెలిపాయి.


నగరం నుంచి బుకింగ్‌లు గత మే నెలలో వచ్చిన లాంగ్‌ వీకెండ్‌తో పోలిస్తే 20ు-30ు బుకింగ్‌లు అధికంగా జరిగే అవకాశాలున్నాయని థామ్‌సకుక్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎక్కువ మంది ఈ లాంగ్‌ వీకెండ్‌ కోసం కేరళ, సిమ్లా, ధర్మశాల, కూర్గ్‌, మహాబలేశ్వరం లాంటి ప్రాంతాల కోసం అడుగుతున్నారని చెబుతున్నారు. కేరళ, కశ్మీర్‌, సిమ్లా, నైనిటాల్‌లాంటి ప్రాంతాలకు వెళ్తున్నారని, కొందరు అస్సాం, మేఘాలయ, ధర్మశాల వంటి చోట్లకు వెళ్తున్నారని ఎస్‌ఓటీసీ ప్రతినిధులు చెబుతున్నారు. దుబాయ్‌ పర్యాటక సంస్థ ఆఫర్లతో నగరవాసులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

Updated Date - Aug 11 , 2024 | 03:47 AM