Balka Suman: రేవంత్ ప్రభుత్వంలో నిరుద్యోగులపై దమన కాండ
ABN, Publish Date - Jul 10 , 2024 | 03:16 PM
రేవంత్ ప్రభుత్వంలో నిరుద్యోగులపై దమన కాండ నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఆరోపించారు. యూనివర్సిటీ హాస్టళ్లల్లో కరెంటు కూడా తీసేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వంలో నిరుద్యోగులపై దమన కాండ నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఆరోపించారు. యూనివర్సిటీ హాస్టళ్లల్లో కరెంటు కూడా తీసేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ , బీసీ మంత్రులకు అధికారులకు అడుగడుగునా అవమానం జరుగుతోందని చెప్పారు. ఈరోజు (బుధవారం) తెలంగాణ భవన్‌లో బాల్కసుమన్ మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రి గుడిలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి అవమానం జరిగిందని, నిన్న బల్కం పేట ఎల్లమ్మ గుడిలో పొన్నం ప్రభాకర్‌కు అవమానం జరిగిందని అన్నారు. దళిత ఎస్ ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ పాలనలో మాటల్లో తప్ప చేతల్లో సామాజిక న్యాయం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి అందర్నీ బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న మహబూబ్ నగర్‌లో నిరుద్యోగులను అవమాన పరిచేలా సీఎం రేవంత్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని నిరసనలు అణచి వేద్దామనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల అండతో గద్దె నెక్కిన రేవంత్ ఇప్పుడు వారిని అణచి వేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ కడప వెళ్లి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కోసం ఊరూరు తిరుగుతానని అంటున్నారని విమర్శించారు. సమైక్య వాదుల కోసం రేవంత్ తాపత్రయ పడుతున్నారని బాల్కసుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Jul 10 , 2024 | 03:36 PM