ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: రేవంత్ కుట్ర పన్నారు.. బీఆర్ఎస్ నేతల ధ్వజం

ABN, Publish Date - Dec 20 , 2024 | 12:57 PM

హైదరాబాద్‌ని సర్వనాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మధుసూదన చారి ధ్వజమెత్తారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మాజీ సీఎం కేసీఆర్ చాలా కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. కేటీఆర్ తనకున్న శక్తి మేరకు ప్రపంచ స్థాయి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి తెచ్చారని తెలిపారు

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసుపై సభలో చర్చించాలని డిమాండ్ చేశామని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి అన్నారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా రేస్‌లో కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసు తీవ్రంగా నిరసన తెలుపుతున్నామని మధుసూదన చారి అన్నారు.


కేటీఆర్ మీద పెట్టిన కేసు ఉపసంహరించుకునేవరకు పోరాడుతామని చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మాజీ సీఎం కేసీఆర్ చాలా కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. కేటీఆర్ తనకున్న శక్తి మేరకు ప్రపంచ స్థాయి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి తెచ్చారని తెలిపారు.తెలంగాణలో విదేశీ పెట్టుబడులు పెట్టేలా ఈ రేస్ చేపట్టారని మధుసూదన చారి అన్నారు.


మొదటి రేసు విజయవంతమైందని.. రెండో రేసును రేవంత్ ప్రభుత్వం ఆపేసిందని చెప్పారు. హైదరాబాద్‌ను సర్వనాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. అన్ని వివరాలు కేటీఆర్ వివరించారని.. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతునందుకే ఈ అక్రమ కేసు పెట్టారని అన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం, అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్ బిడ్డలకు పోరాటాలు కొత్తకాదు ఎలాంటి కేసులైన ధైర్యంగా ఎదుర్కొంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదన చారి అన్నారు.


కేటీఆర్‌పై కేసు అక్రమం: మహమూద్ అలీ

కేటీఆర్ మీద పెట్టిన కేసు అక్రమమని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ రేస్ తెచ్చారని.. అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. హైదరాబాద్ ఇమేజ్ మరింత పెంచేందుకు ఈ రేస్ తెచ్చారన్నారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద కేసులు పెట్టడం కాదని.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మహమూద్ అలీ డిమాండ్ చేశారు.


కుట్రలో భాగంగానే అక్రమ కేసులు: ఎమ్మెల్సీ సత్వవతి రాథోడ్

మండలిలో ప్రజాసమస్యలపై పోరాడుతున్నామని.. సమస్యలను పక్కనపెట్టి బిల్లులు ఆమోదించుకుంటున్నారని ఎమ్మెల్సీ సత్వవతి రాథోడ్ అన్నారు. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని చెప్పారు. గిరిజన లగచర్ల రైతులకు అండగా నిలిచినందుకే కేటీఆర్‌పై కేసులు పెట్టారని ఆరోపించారు. లంబాడీలు, గిరిజనులు అంతా ఏకమై ప్రభుత్వం కుట్రలను తిప్పికొడతామని అన్నారు. రేవంత్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ సత్వవతి రాథోడ్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Lagacharla Case: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

TG NEWS: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమందికి తీవ్ర గాయాలు

NTR Statue: ఓఆర్‌ఆర్‌ వద్ద వంద అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 20 , 2024 | 01:04 PM