BRS: మంత్రి తుమ్మల ప్రకటనపై ధర్నాకు దిగిన గులాబీ శ్రేణులు
ABN, Publish Date - Oct 20 , 2024 | 06:07 PM
రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆందోళనలు చేస్తున్నారు.
హైదరాబాద్: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గులాబీ శ్రేణులు, రైతులు ఆందోళనలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దిపూర్ గ్రామంలో డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ శవయాత్రను ఊరేగింపుగా నిర్వహించి రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు.
ఆర్మూర్ మండలం మాణిక్ బండారు చౌరస్తాలో ఖరీఫ్ పంటకు రైతు భరోస ఇవ్వటం లేదని నిరసనగా ఆర్మూర్- నిజామాబాద్ రహదారిపై రైతుల రాస్తారోకో చేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహేశ్వరంలో రైతు భరోసా వెంటనే అమలు చేయాలని కేటీఆర్ పిలుపు మేరకు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలమేరకు మహేశ్వరం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపి, అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం అందజేసి, సీఎం రేవంత్ దిష్టి బొమ్మ దహనం చేశారు. సీఎం డౌన్ సీఎం డౌన్ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు.
నల్గొండ జిల్లా చండూర్‌లోని స్థానిక చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. చేత కానీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట తెలంగాణ తల్లి విగ్రహం వద్ద.. రైతు భరోసా ఎగవేతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు భరోసా వెంటనే ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. హనుమకొండ జిల్లాలో రైతు భరోసా ఎగవేతను నిరసిస్తూ కాజీపేట చౌరస్తాలో ధర్నాకు దిగారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండల కేంద్రంలో రేవంత్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Tummala: రైతుబంధు పేరుతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోచిపెట్టారు... మంత్రి తుమ్మల ధ్వజం
ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..
Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..
HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
For Telangana News And Telugu News...
Updated Date - Oct 20 , 2024 | 06:11 PM