ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chamala Kiran Kumar Reddy: బామ్మర్ది టిల్లు.. బావ సొల్లు.. బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

ABN, Publish Date - Nov 03 , 2024 | 05:08 PM

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదవి ఇచ్చి , రూమ్ ఇచ్చామని కానీ మహేశ్వర్ రెడ్డి కలెక్షన్స్ బాగా చేస్తున్నారని.. ఆయన్ను పక్కన పెట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు . ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రి అయ్యే వాడినని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఏఐసీసీ నేతలు ఏం అనుకుంటున్నారనేది చెబుతున్నారని విమర్శించారు.

హైదరాబాద్: బామ్మర్ది టిల్లు.. బావ సొల్లు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఇచ్చిన హామీల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఇచ్చిన రెండు మేనిఫెస్టోలు.. తమ ప్రభుత్వ ఒక్కో మేనిఫెస్టో తీసుకుని చర్చకు రావాలి.. తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని స్పష్టం చేశారు.కేసీఆర్ పదేళ్లలో పది సార్లు కూడా సచివాలయంలో కూర్చున్న దాఖలాలు లేవని విమర్శలు చేశారు. తెలంగాణకు ఎంత వడ్డీ ఉందనేది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత తేలిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ అభివృద్ధిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. చివరకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని చేతులెత్తేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.


బావ, బామ్మర్ది మధ్య పోటీ ...

‘‘మా ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కలు చెబుతాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్‌కి రేవంత్ రెడ్డి స్పందిస్తే.. దానికి హరీష్ రావు ట్వీట్ చేశారు. మా ప్రభుత్వం మీద ఆపవాదు వేయడం తప్ప మెరుగైన పాలన అందించేలా సలహాలు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీకి వడ్డీ మాత్రమే కట్టారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా రుణమాఫీ చేశారు. మీకన్నా మెరుగైన పాలన అందించామా లేదా చెప్పండి. బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ పడింది. దానికోసం బావ, బామ్మర్ది మధ్య పోటీ పెరిగింది.బీఆర్ఎస్ పార్టీనీ తెలంగాణ కోసం పెట్టలేదు. కలెక్షన్లు.. కమీషన్లు దండుకోవడానికి ఆ పార్టీ పెట్టారు. గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అలయన్స్‌లో రబ్బరు చెప్పుల హరీష్ రావు మంత్రి అయ్యాడు’’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.


మహేశ్వర్ రెడ్డి కలెక్షన్స్ బాగా చేస్తున్నారు...

‘‘కాంగ్రెస్ పుణ్యాన మీ మామ కేసిఆర్ సీఎం.. మీ బావ లీడర్ అయ్యారు. కేకే మహేందర్ రెడ్డినీ కాదని కేటీఆర్‌కు టిక్కెట్ ఇచ్చి మహేందర్ రెడ్డికి అన్యాయం చేశారు. రాజ్యాంగం కూడా తెలియకుండా మళ్లీ ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయి అంటున్నారు సిగ్గు లేకుండా.. ఒక్క పార్లమెంట్ సీటు అయిన గెలుచుకున్నారా మీరు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదవి ఇచ్చి.. రూమ్ ఇచ్చాం. కానీ మహేశ్వర్ రెడ్డి కలెక్షన్స్ బాగా చేస్తున్నారని ఆయన్ను పక్కన పెట్టారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రి అయ్యే వాడినని కలలు కంటున్నాడు.అందుకే ఏఐసీసీ నేతలు ఏం అనుకుంటున్నారనేది చెబుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా మరో పదేళ్లు సీఎంగా కొనసాగుతాడు. అదృష్టం కొద్దీ మహేశ్వర్ రెడ్డి గెలిచాడు. బీజేపీ నేతగా ఉండి మేము అధికారంలోకి వస్తామని కూడా చెప్పకుండా..బీఆర్ఎస్ వస్తుందని చెబుతున్నాడు’’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics : రైతులను రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్

TG Politics: ‘దౌర్భాగ్య స్థితిలో రేవంత్ సర్కార్’

Minister Jupally: అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులది..

For Telangana News And Telugu News

Updated Date - Nov 03 , 2024 | 06:12 PM