Share News

CM Revanth: కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

ABN , Publish Date - Jul 24 , 2024 | 01:47 PM

Telangana: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జై కేటీఆర్, పుట్టిన రోజు శుభాకాంక్షలు కేటీఆర్ అన్న అంటూ కార్యకర్తలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేటీఆర్‌‌పై ఉన్న అభిమానంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు కేక్‌ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

CM Revanth: కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్, జూలై 24: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (BRS Working President KTR) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జై కేటీఆర్, పుట్టిన రోజు శుభాకాంక్షలు కేటీఆర్ అన్న అంటూ కార్యకర్తలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేటీఆర్‌‌పై ఉన్న అభిమానంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు కేక్‌ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అదే విధంగా కేటీఆర్‌కు పార్టీల నేతలు, అధినేతలు, ఇతర పార్టీల నేతలు కూడా విషెస్ తెలుపుతున్నారు.

CM Chandrababu: ఆలోచన లేకుండా చట్టాన్ని తీసుకొచ్చారు.. ల్యాండ్ టైటలింగ్ బిల్లుపై చంద్రబాబు ఫైర్


తాజాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘కల్వకుంట్ల తారకరామారావు గారు, మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ కేటీఆర్ సీఎం రేవంత్ విషెస్ తెలిపారు. ఈమేరకు బుధవారం ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.

ktr-revanth-press-note.jpg

Minister Sitakka:10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తుంది..


అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఒకరికొకరు రాజకీయంగా ప్రత్యర్థులు అయినప్పటికీ ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాలలో విషెష్ చెప్పుకోవడం కామన్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలారు కూడా. అసెంబ్లీ బయట, లోపల కూడా విమర్శలు గుప్పించుకున్నారు. అయితే రాజకీయపరంగా నాయకులు ఎలా ఉన్నప్పటికీ పుట్టిన రోజున మాత్రం ఏమాత్రం సంకోచించకుండా శుభాకాంక్షలు తెలుపుకోవడం అనేది పరిపాటి జరుగుతుంటుంది.

AP Assembly: ఇసుక కుంభకోణంపై మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇదీ...


ఇదిలా ఉంటే... బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ రెండు దఫాలుగా మంత్రిగా పనిచేశారు. ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పనితీరును, రాష్ట్రానికి తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ గురించి ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటూ.. దటీజ్ కేటీఆర్ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు.


ఇవి కూడా చదవండి...

TS Assembly: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్... ఏ విషయంలో అంటే?

BRS MLAs: చెరో 8 సీట్లు గెలిచి తెలంగాణకు 8 పైసలు కూడా తీసుకురాలేదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2024 | 01:55 PM