AP Assembly: ఇసుక కుంభకోణంపై మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇదీ...
ABN , Publish Date - Jul 24 , 2024 | 12:25 PM
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సంద్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ మొదలైంది. అవకతవకలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని పర్చూరు ఎమ్మెల్యే సాంబశివ రావు ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. జేపీ వెంచర్స్ రూ.842 కోట్లు ప్రభుత్వానికి బకాయి పడిందని చెప్పారు.
అమరావతి, జూలై 24: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సంద్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ మొదలైంది. అవకతవకలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని పర్చూరు ఎమ్మెల్యే సాంబశివ రావు ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) సమాధానమిస్తూ.. జేపీ వెంచర్స్ రూ.842 కోట్లు ప్రభుత్వానికి బకాయి పడిందని చెప్పారు. అయినా వారికి ఎటువంటి బకాయిలు లేవని ఆనాటి ఏపీఎండీసీ ఎండీ వెంకట రెడ్డి ఎన్‌ఓసీ ఇచ్చారన్నారు.
Somireddy: అవసరమైతే అదానీ కాళ్లైనా పట్టుకుంటా...
వీళ్ళు ఎంత మేరకు తవ్వారు అనే అంశంపై శాటిలైట్ ఇమేజెస్ ద్వారా దర్యాప్తు చేయిస్తున్నామని మంత్రి కొల్లురవీంద్ర చెప్పుకొచ్చారు. ఇసుక అవకతవకలపై చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఇసుకపై సభ్యులు చెప్పిన విషయాలు అన్నీ కఠిన వాస్తవాలు అని అన్నారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి స్పీకర్ అన్నారు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే...
కాగా.. వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీగా ఇసుక కుంభకోణం జరిగింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇసుక సమస్య కారణంగా నిర్మాణ రంగంలో ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక లభ్యతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిసారించారు. అనుకున్నదే తడువుగా ఉచిత ఇసుక పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈనెల రెండో వారంలో ఉచిత ఇసుక పాలసీ జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.
BRS: ఇప్పటి వరకు ఆ చెక్కు బస్ భవన్‌కు చేరలేదు: హరీష్ రావు
వైసీపీ ప్రభుత్వంలోని 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాల విడుదల చేసింది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సర్కార్ సూచనలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
MP Nagaraju: జగన్.. ఏదైనా ఉంటే ప్రజల తరపున అసెంబ్లీలో పోరాడు.. అంతేకానీ
Somireddy: అవసరమైతే అదానీ కాళ్లైనా పట్టుకుంటా...
Read Latest AP News And Telugu News