ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ప్రభుత్వ పాఠశాలలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు

ABN, Publish Date - Dec 29 , 2024 | 07:34 PM

CM Revanth Reddy: ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కన్హా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్‌కు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్‌ను అక్కడి విద్యార్థులు ప్రదర్శించడం చూసి ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

CM Revanth Reddy

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కన్హా శాంతివనాన్ని ఇవాళ(ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్‌కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్‌ను అక్కడి విద్యార్థులు ప్రదర్శించడం చూసి ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఇలాంటి స్కిల్స్‌ను ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లోనూ అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అనంతరం కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంట‌ర్‌ను సందర్శించారు. వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతి వనం నిర్వాహకులు సీఎం రేవంత్‌రెడ్డికు వివరించారు. శాంతివనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్‌ను సీఎం సందర్శించారు. అనంతరం మెడిటేషన్ సెంటర్ వద్ద Galibuda (Scientific Name: Hildergardia Populifolia) మొక్కను నాటి మెడిటేషన్ హాల్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు,ఎమ్మెల్యె శంకరయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అభినందనలు..

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈరోజు ఫోన్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మంత్రికి ఫోన్ చేసి అభినందించారు. ‘‘మీ కృషి, మీ సహకారం, మీ సలహాతోనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కింది’’ అని ముఖ్యమంత్రికి మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు మీ అనితరసాధ్యమైన సహకారంతోనే ఈ సంవత్సరంలో సాధ్యమైందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు మంజూరు చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Harish Rao: పోలీస్ శాఖలో మరణ మృదంగం.. ఈ ప్రభుత్వానికి పట్టదా?

Telangana Crime Rate Report 2024: తెలంగాణ క్రైమ్ రేటు నివేదికలో వెలుగులోకి సంచలన విషయాలు

New Year: తారల తళుకులు.. మోడళ్ల మెరుపులు.. ఈసారి అంతకుమించి..

For More Telangana News And Telugu News

Updated Date - Dec 29 , 2024 | 07:37 PM