ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijayashanti: కాంగ్రెస్‌లో ఉంటూనే బీఆర్‌ఎస్‌పై రాములమ్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్...

ABN, Publish Date - May 17 , 2024 | 02:59 PM

Telangana: రాములమ్మ అంటే తెలియని వారు ఉండరు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న విజయశాంతి గతేడాదే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌లో రాములమ్మకు కీలక పదవి కూడా లభించింది. పార్టీలో చేరిన 24 గంటల్లోనే క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీకి చీఫ్‌ కో-ఆర్డినేటర్ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌లో ఉంటూనే బీఆర్‌ఎస్‌ పార్టీ గురించి విజయశాంతి మాట్లాడటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Vijayashanti Intresting Tweet

హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ (BRS) ఉండదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి (Vijayashanthi) ఆసక్తికరంగా స్పందించారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని ఆమె అన్నారు. ఆత్మగౌరవం, పోరాటతత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణమని ఆమె వ్యాఖ్యానించారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేక పోయిందని రాములమ్మ విమర్శించారు. ఈ మేరకు కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా విజయశాంతి స్పందించారు.

AP Elections 2024: ఏపీలో పలువురు అధికారుల బదిలీలు.. కారణమిదే..?


ట్వీట్ ఇదే..

‘‘తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. ఎప్పటికీ ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి.. దక్షిణాది... దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం... ఎన్నడైనా.. వాస్తవం...ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి ప్రకటన భావం’’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి....

Air India: రన్‌‌వేపై ట్రగ్ ట్రాక్టర్‌ను ఢీకొట్టిన విమానం.. ఆందోళనకు గురైన ప్రయాణికులు

Billionaires Index: వరల్డ్ సూపర్ రిచ్ జాబితాలో అంబానీ, అదానీ..ఇంకా ఎవరెవరు ఉన్నారంటే

BJP: మమతా.. మీ రేటెంత? అంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2024 | 03:58 PM

Advertising
Advertising