TG High Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్
ABN, Publish Date - Nov 04 , 2024 | 11:06 AM
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టనుంది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ఫై ఇవాళ( సోమవారం) తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ వాదనలు వినిపించనున్నారు. పాల్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనున్నది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేయనుంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని కోరుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టనుంది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.
కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జూలై 3వ తేదీన హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారని.. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డిలు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ కార్యాలయంలో పిటిషన్ ఇచ్చినా స్పీకర్ చర్యలు తీసుకోలేదని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. ఈ తీర్పుపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి
TG News: ఎగ్జామ్స్ రాసేందుకు వచ్చిన యువతిపై దారుణం
Harish Rao: గ్రామాన్ని అభివృద్ధి చేసిన వారిని అరెస్ట్ చేస్తారా
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా కేటీఆర్ సంచలన ట్వీట్లు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 04 , 2024 | 11:13 AM