ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Etala Rajender: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Jul 13 , 2024 | 08:25 PM

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పరిష్కరించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) డిమాండ్ చేశారు.

Etala Rajender

హైదరాబాద్: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పరిష్కరించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం) సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో వారి సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారి కంటే ప్రభుత్వ శాఖల్లో అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. నిత్యం పని ఒత్తిడి తక్కువ వేతనాలతో సతమతమవుతున్న వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. మానవతా దృక్పథం కలిగిన ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని ఏళ్ల తరబడి ఉద్యోగులు నిరీక్షిస్తున్నారని చెప్పారు. అలాంటి వారి సమస్యపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం నియామక ప్రక్రియ సమయంలో అవుట్‌ సోర్సింగ్ పద్ధతిగా పనిచేస్తున్న వారికి రేవంత్ ప్రభుత్వం అవకాశం కల్పించాలని ఈటల రాజేందర్ కోరారు.

Updated Date - Jul 13 , 2024 | 08:29 PM

Advertising
Advertising
<