Share News

Delhi: కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్, హరీష్

ABN , Publish Date - Aug 23 , 2024 | 10:45 AM

Telangana: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ అయి గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతీసారి కవితకు నిరాశానే ఎదురవుతోంది. మరోవైపు జైలులో ఉన్న కవిత బరువు తగ్గారని వార్తలు వినిపించాయి. అయితే నిన్న కవిత జైలులో అస్వస్థతకు గురయ్యారు.

Delhi: కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్, హరీష్
BRS MLC Kavitha

న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 23: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అరెస్ట్‌ అయి గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతీసారి కవితకు నిరాశానే ఎదురవుతోంది. మరోవైపు జైలులో ఉన్న కవిత బరువు తగ్గారని వార్తలు వినిపించాయి. అయితే నిన్న కవిత జైలులో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను జైలు అధికారులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.


ఆరోగ్యం నిలకడ అయిన తర్వాత తిరిగి కవితను తీహార్‌ జైలుకు తరలించారు అధికారులు. జైలులో కవిత అనారోగ్యం బారిన పడటం ఇదిరెండో సారి. కాగా.. జైలులో ఉన్న కవితతో మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్‌రావులు (HarishRao)ఈరోజు ములాఖత్ కానున్నారు. కవిత అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కవితను కలిసేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

Kejriwal: సుప్రీంలో కేజ్రీవాల్‌కు ఊరట లభిస్తుందా?


కాగా.. నిన్న జైలులో అస్వస్థతకు గురైన కవితకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యలు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ ఆమెను ఎయిమ్స్‌కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత సీబీఐ సైతం ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థల కేసుల్లో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం ఇప్పటికే అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసినా.. ఈడీ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు.


ఇవి కూడా చదవండి...

Revanth Reddy: ఢిల్లీ ఫర్యటనలో రేవంత్.. టీపీసీసీ చీఫ్ ఆయనకేనా?

Pharma company explosion: ఊపిరి తీసిన ‘ఆవిరి’!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 23 , 2024 | 11:01 AM