ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Phone Tapping Case: మంత్రి కోమటిరెడ్డికి హరీశ్‌రావు సవాల్

ABN, Publish Date - Jun 02 , 2024 | 08:41 PM

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమందిని కాపాడటానికి గత సీఎండీ ప్రభాకర్ రావును దొంగచాటుగా అమెరికా వెళ్లి కలిసి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కోమటిరెడ్డికి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.

Harish Rao

హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమందిని కాపాడటానికి గత సీఎండీ ప్రభాకర్ రావును దొంగచాటుగా అమెరికా వెళ్లి కలిసి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కోమటిరెడ్డికి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతిభ్రమించిందని... ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. తాను, తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లింది వాస్తవమని తెలిపారు.తాను అమెరికా వెళ్లి, ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు.


ఆయన రుజువు చేయకపోతే వెంకటరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని ప్రతి సవాల్ విసిరారు.తాను ఏ దేశం వెళ్లానని, ఏ హోటల్‌లో ఉన్నానో తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.తన పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తానని అన్నారు. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయని స్పష్టం చేశారు.కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనంగా ఉందని ఎద్దేవా చేశారు.కోమటిరెడ్డి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో రాని పక్షానా భేషరతుగా క్షమాపణ చెప్పాలని.. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు.


కోమటిరెడ్డి చెప్పిన తేదీన, చెప్పిన టైంకి అమరవీరుల స్తూపం వద్దకు తాను వస్తాను, ఆయన ఆధారాలతో రావాలని అన్నారు. టీవీల్లో బ్రేకింగ్, స్క్రోలింగ్‌ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలని కోరారు. నిరాధార నిందలు వేసి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకొని కోమటిరెడ్డి తన హుందాతనాన్ని నిలుపుకోవాలని హితవు పలికారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఆ భగవంతుడు మీకు సద్భుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటునని హరీశ్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: అందుకే అమెరికాకు హరీశ్‌రావు .. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

CM Revanth: బానిసత్వాన్ని తెలంగాణ భరించదు

Telangana Formation Day: అవి గుర్తుకు వస్తే దుఃఖం వస్తుంది: కేసీఆర్

Telangana State Formation Day: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: కేటీఆర్

For more Telangana News and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 09:55 PM

Advertising
Advertising