ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తాం

ABN, Publish Date - Jul 29 , 2024 | 09:26 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు వాడివేడిగా జరిగాయి. ఐదో రోజు సోమవారం నాడు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చించారు.

Harish Rao

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు వాడివేడిగా జరిగాయి. ఐదో రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్లపై చర్చించారు. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సభలో వాడి వేడిగా చర్చ జరిగింది.

సభ సమావేశాల అనంతరం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తామని అన్నారు. పాలక పక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా ముఖ్యమంత్రి సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభను పక్క దారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సభా నాయకుడు ఆదర్శంగా ఉండాల్సింది పొయి సభలో అబద్దాలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు.


గత సమావేశాల్లో మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని అబద్ధమాడారని ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఇంజినీర్ల వాదన వేరే లాగా ఉంటే సీఎం మరోలా చెప్పి సభను తప్పుదోవ పట్టించారని ఆక్షేపించారు. నిన్నటి సమావేశంలో విద్యుత్ మీటర్లపై కూడా తప్పుడు పత్రంతో సీఎం సభను తప్పు దోవ పట్టించారని ఫైర్ అయ్యారు. తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశారని అన్నారు. ఉదయ్ స్కీం ఒప్పందం చదివి వ్యవసాయ మీటర్లకు ఒప్పుకున్నట్టు భ్రమింపజేశారని విమర్శలు చేశారు. పోతిరెడ్డిపాడుపై దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తాము పదవుల కోసం పెదవులు మూసుకున్నామని రేవంత్ తమపై ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. పోతిరెడ్డి పాడుపై జీఓ రాకముందే తాము వైఎస్ కేబినెట్ నుంచి వైదొలిగామని స్పష్టం చేశారు.


పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి అనే విమర్శించారు. తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్టు రేవంత్ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే తాము రాజీనామా చేశామని ఉద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదని ఆక్షేపించారు. రేవంత్ లాంటి వారు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జరిగాయని చెప్పారు. ఆనాటి అమరుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ తెలంగాణ కోసం పని చేయలేదని విమర్శలు చేశారు. ఎల్ఆర్ఎస్ గురించి రేవంత్ అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు.


మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి , మల్లు భట్టి విక్రమార్క , ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ఆర్ఎస్‌ను ఫీజులు లేకుండా చేయాలని ఆనాడు డిమాండ్ చేశారని అన్నారు. ఇప్పుడేం చేస్తున్నారని అన్నీ ద్వంద్వ ప్రమాణాలేనని ఆరోపించారు. జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ పార్టీనైనా ఒప్పించారా.. ? అని నిలదీశారు. రుణమాఫీపై రేవంత్ ది గోబెల్స్ ప్రచారం చేశారని దుయ్యబట్టారు. రూ.31 వేల కోట్లు రుణమాఫీకి కావాల్సి ఉందని .. అయితే రూ.25 వేల కోట్లను మాత్రమే బడ్జెట్‌లో పెట్టారని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 29 , 2024 | 10:04 PM

Advertising
Advertising
<