Share News

T.High Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Jul 11 , 2024 | 09:25 AM

Telangana: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతా పిటీషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై పిటిషన్ దాఖలైంది.

T.High Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ
Telangana High Court

హైదరాబాద్, జూలై 11: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతా పిటీషన్లపై ఈరోజు హైకోర్టులో (Telangana High Court) విచారణ జరుగనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై పిటిషన్ దాఖలైంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి ఏయూలో ప్రొఫెసర్‌షిప్‌


గత విచారణలో స్పీకర్‌కు ఆదేశాలిచ్చే అధికారం హైకోర్టుకు లేదని ఏజీ వెల్లడించారు. గతంలో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదే విషయాన్ని చెప్పిందని ఏజీ గుర్తుచేశారు. తలసాని టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఎర్రబెల్లి దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పు ఇవ్వడానికి ఇదే కోర్టు నిరాకరించిందన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు. చట్టసభ నుంచి సభ్యుడి సస్పెన్షన్ లేదా అనర్హత వేటు వంటి నిర్ణయాలు స్పీకర్ పరిధిలోనివని ఏజీ పేర్కొన్నారు. ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు మరోసారి విచారణ జరుపనుంది. హైకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


ఇవి కూడా చదవండి...

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి బిగ్ షాట్, మరో 9 మంది నేతలు కూడా..!

Nitish Kumar: నితీశ్‌ రాజకీయ వారసుడు మనీశ్‌!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 11 , 2024 | 10:13 AM