ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG High Court: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై హై కోర్టు కీలక ఆదేశాలు

ABN, Publish Date - Jul 10 , 2024 | 04:19 PM

ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone Tapping Case) తెలంగాణ హై కోర్టులో (Telangana High Court) ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. ఈ కేసుపై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Phone Tapping Case

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone Tapping Case) తెలంగాణ హై కోర్టులో (Telangana High Court) ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. ఈ కేసుపై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో మీడియా సంయమనం పాటించాలని సూచించింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని స్పష్టం చేసింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్‌ నెంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్ నెంబర్ ప్రచురించినట్లు కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.


ఈ విషయంలో మీడియా సంయమనం, బాధ్యతతో వ్యవహరిస్తుందని నమ్ముతున్నామని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఫోన్‌టాపింగ్ కేసుకు సంబంధించిన వార్త రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఫోన్‌ టాపింగ్ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారని గుర్తుచేసింది. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకోవడం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈనెల 23న కౌంటర్‌ దాఖలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను 23కు హైకోర్టు వాయిదా వేసింది.


కాగా... పోలీసు శాఖతో పాటు రాజకీయపరంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తును ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రణీత్ రావు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బహిర్గతమవుతోంది. ఎస్‌ఐబి కార్యాలయంతో పాటు ఇతర ప్రైవేటు ప్రదేశాల్లోనూ ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తుండగా, పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, సీఐ గట్టు మల్లును పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.

Updated Date - Jul 10 , 2024 | 05:29 PM

Advertising
Advertising
<