Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..
ABN , Publish Date - Jun 15 , 2024 | 01:59 PM
Telangana IAS Officers Transfer: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేసింది. 20 మంది ఐఎస్ఎస్‌లను(IAS Officers) బదిలీ చేస్తూ ప్రభుత్వం..
Telangana IAS Officers Transfer: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేసింది. 20 మంది ఐఎస్ఎస్‌లను(IAS Officers) బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, ములుగు సహా మొత్తం 20 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మళ్లీ ఆరు నెలల తరువాత ఇంతటిస్థాయిలో బదిలీలు చేపట్టింది ప్రభుత్వం.
తెలంగాణలో బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలివే..
1. ఖమ్మం కలెక్టర్‌గా ముజామ్మిల్ ఖాన్ నియామకం
2. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా బదావత్ సంతోష్ నియామకం.
3. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్ కుమార్ జా నియామకం.
4. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా అనురాగ్ జయంతి నియామకం.
5. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఆశిష్ సంగ్వాన్ నియామకం.
6. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్ నియామకం.
7. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్ శర్మ నియామకం.
8. నారాయణ్‌పేట్ జిల్లా కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్ నియామకం.
9. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా కోయ శ్రీ హర్ష నియామకం
10. హన్మకొండ కలెక్టర్‌గా పి. ప్రవీణ్య నియామకం.
1 1 . జగిత్యాల కలెక్టర్‌గా బి సత్యప్రసాద్ నియామకం.
12. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బి. విజియేంద్ర నియామకం.
13. మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా కుమార్ దీపక్ నియామకం.
14. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ నియామకం.
15. నల్లగొండ కలెక్టర్‌గా నారాయణ రెడ్డి నియామకం.
16. వనపర్తి కలెక్టర్‌గా ఆదర్శ్ సురభి నియామకం.
17. సూర్యపేట కలెక్టర్‌గా తేజస్ నందలాల్ పవార్ నియామకం.
18. వరంగల్ కలెక్టర్‌గా ఎం సత్య శారదా దేవి నియామకం.
19. ములుగు కలెక్టర్‌గా దివాకర నియామకం.
20. నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా అభిలాష అభినవ్ నియామకం.