ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagadish Reddy: సీఎం రేవంత్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా రు.. జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jun 26 , 2024 | 03:34 PM

బీఆర్ఎస్ (BRS) బీ ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి , డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. గూడెం మహిపాల్ రెడ్డీ పార్టీ మార్పుపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డే ఇల్లు ఇల్లు తిరిగి కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు.

Jagadish Reddy

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) బీఫామ్‌పైన గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి , డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. గూడెం మహిపాల్ రెడ్డీ పార్టీ మార్పుపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డే ఇల్లు ఇల్లు తిరిగి కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు.

తమ ఎమ్మెల్యేలను ఢిల్లీలో కలవడని గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేల సభ్యతం రద్దు కావల్సి ఉన్నదన్నారు. నిన్నటి నుంచి స్పీకర్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, స్పీడ్ పోస్టు, ఈ మెయిల్ ద్వారా ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశామన్నారు.


వారిపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని.. లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఈరోజు (బుధవారం) తెలంగాణ భవన్‌లో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. పాంచ్ న్యాయ్‌లో భాగంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టారని గుర్తుచేశారు.

మళ్లీ వారే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే చెబుతున్నారన్నారు. తమ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకున్నారని అన్నారు. చట్టం ప్రకారం 2\3 వంతు తమ పార్టీలో జాయిన్ అయ్యారని గుర్తుచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Damodar:నిమ్జ్‌ వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

Jagadish Reddy: సీఎం రేవంత్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా రు.. జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 04:21 PM

Advertising
Advertising