Share News

Jeevan Reddy: బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదు..

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:42 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదని, ఓటమిని అంగీకరించే పరిస్థితిలో మాజీ మంత్రి కేటీఆర్ లేరని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.

Jeevan Reddy: బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదు..

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదని, ఓటమిని అంగీకరించే పరిస్థితిలో మాజీ మంత్రి కేటీఆర్ లేరని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పెద్ద స్కాం అని, కాళేశ్వరం రీ డిజైన్ పెద్ద బోగస్ అని, కేవలం కమీషన్‌ల కోసం రీ డిజైన్ చేసారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్‌ను ఎస్సీ డెవలప్‌మెంట్ ఫండ్‌గా మార్చి నిధులను మళ్ళించిందన్నారు. నిధుల దారి మళ్ళింపును చర్చకు రాకుండా చేసేందుకు దలితబందును తెరపైకి తెచ్చారన్నారు.

గిరిజనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచిందని, అందుకే వాళ్ళు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని జీవన్ రెడ్డి అన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో ఎన్నికల ముందు హాడావిడి చేసారన్నారు. బీఆర్ఎస్ పరోక్ష మిత్ర పక్షంగా భావిస్తున్న బీజేపీ పక్కలో బల్లంలా కాచుకుని ఉందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు రావన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం కాదని.. అధి నాయకుడిని మార్చాలని ప్రజలు డిసైడ్ అయ్యారని.. మార్చారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 12 , 2024 | 12:42 PM