Congress: నేడు హైదరాబాద్‌కు రానున్న కేసీ వేణుగోపాల్
ABN , Publish Date - Apr 14 , 2024 | 08:24 AM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌లోని నోవోటెల్ హోటల్లో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రులు, పార్టీ కీలక నేతలు హాజరుకానున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌లోని నోవోటెల్ హోటల్లో (Novotel Hotel) కాంగ్రెస్ నేతల (Congress Leaders) కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ (Dipadas Munshi), మంత్రులు (Ministers), పార్టీ కీలక నేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ ప్రచార వ్యూహంపైన కేసీ వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు.
అలాగే పాంచ్ న్యాయ్ గ్యారెంటీలు, పార్టీ మేనిఫెస్టోని నెల రోజుల్లో ప్రతి ఇంటికీ ఎలా తీసుకెళ్లే అంశంపై కేసీ వేణుగోపాల్ నేతలతో చర్చలు జరపనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల సభల ఏర్పాట్లు, వాటికి సంబంధించిన షెడ్యూల్‌పైన సమీక్ష చేయనున్నారు. ఏఐసీసీ నిర్వహించిన సర్వేలలో నియోజకవర్గల్లో పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్నా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధులపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా ఈ సమావేశానికి పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు హాజరుకానున్నారు.