ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

ABN, Publish Date - Nov 08 , 2024 | 03:28 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (శుక్రవారం) యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం... యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ఆఖండ దీపారాదన చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు.

యాదాద్రి : యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ అభివృద్ధిపై సీఎం ఇవాళ(శుక్రవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో అధికారులతో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చించారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని అన్నారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.


గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అన్నారు. గతంలో భక్తులు కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం లేదని గుర్తుచేశారు. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.


ఇందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్‌తో రావాలని అదేశించారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ అందించాలని అన్నారు. ఇకనుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Bandi sanjay: తెలంగాణలో యాక్టివ్ సీఎం కేటీఆరే.. బండి సెన్సేషనల్ కామెంట్స్

Revanth Birthday: అదిరిపోయేలా రేవంత్ బర్త్‌డే కానుక.. మీరూ ఓ లుక్కేయండి

KTR: మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 03:38 PM