Kishan Reddy: రేవంత్‌రెడ్డి హిందూ వ్యతిరేఖ వైఖరిలో ఉన్నారు.. కిషన్‌రెడ్డి ధ్వజం
ABN, Publish Date - Oct 20 , 2024 | 09:39 PM
హిందూ దేవాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్ 1 సమస్య , సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం నగరం ఘటనలతో భాగ్యనగరం అట్టుడుకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: హిందూ దేవాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్ 1 సమస్య , సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం ఘటనలతో భాగ్యనగరం అట్టుడుకుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో వరుస ఘటనలు జరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) బీజేపీ కేంద్ర కార్యాయలంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
రేవంత్‌రెడ్డి హిందూ వ్యతీరేఖ వైఖరిలో ఉన్నారని విమర్శించారు. నగరంలో జరిగిన పలు పండుగలపై ఆంక్షలు విధించారని ఫైర్ అయ్యారు. ఇతర ప్రార్ధన మందిరాల నుంచి వస్తున్నా శబ్దాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని కిషన్‌రెడ్డి నిలదీశారు. మోటివేషన్ పేరుతో హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణితో ఉంటుందని ఆరోపించారు. హిందువుల విషయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకీ సానుకూల వైఖరి లేదని అన్నారు. ఒక వర్గానికి దగ్గర అయ్యేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు.
ఎన్నికల్లో 400 హామీలు ఇచ్చారని.. ఎందుకు అమలు చేయడం లేదని అడిగారు. నిన్న గ్రూప్ - 1 అభ్యర్థులు నిరసన చేపడితే కొంతమంది మీద పోలీసులు దమన కాండ చేశారని మండిపడ్డారు. పోలీసుల లాఠీఛార్జిలో అనేక మందికి గాయాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ లాఠీఛార్జి జరగలేదని కిషన్‌రెడ్డి చెప్పారు.
కానీ కాంగ్రెస్ హయాంలో దీనికి భిన్నంగా ఉందని అన్నారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రణాళిక బద్దంగా కొంతమంది దాడి చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ వైఖరి ఏంటో అంత గమనిస్తున్నారని చెప్పారు. అశోక్ నగర్ లైబ్రరీ వద్ద రేవంత్ రెడ్డి , రాహుల్ గాంధీలు కాకమ్మ కబుర్లు చెప్పారని కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Tummala: రైతుబంధు పేరుతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోచిపెట్టారు... మంత్రి తుమ్మల ధ్వజం
ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..
Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..
HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
For Telangana News And Telugu News...
Updated Date - Oct 20 , 2024 | 10:33 PM