Kishan Reddy: అల్లు అర్జున్ ఎపిపోడ్.. కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 23 , 2024 | 02:35 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో రేవంత్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి బన్నిని విడుదల చేశారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయంపై మాట్లాడారు. అయితే ఈ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరోసారి స్పందించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ(సోమవారం)ఏబీఎన్‌తో కిషన్‌రెడ్డి మాట్లాడారు.ఈ ఘటనలో పోలీసుల వైఫల్యమే ఉందని అన్నారు.
ALSO READ: Biryani: బిర్యానీలో వచ్చింది తినుంటే గొంతు తెగేదే..
ప్రభుత్వం ఈ ఘటనను అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ సంఘటన జరగకుండా చూసుకోవడంలో పోలీసులు పకడ్బందీగా ఎందుకు వ్యవహరించలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాలకు సినిమాలకు ఏం సంబంధమని నిలదీశారు. ఇది రేవంత్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే చూడాలని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో సాధించింది ఏం లేదని అన్నారు. రెండు పార్టీలు ప్రజలను నమ్మించి మోసం చేశాయని విమర్శలు చేశారు. ఈ ఏడాదిలో బీజేపీ చాలా సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. వచ్చే ఏడాదిలో ప్రజల మనోభిష్టం మేరకు పనిచేస్తామని తెలిపారు. తమ ముందు ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అని ఎవరు అనరని.. బీజేపీ సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీను ఓడించడమని తెలిపారు. కాంగ్రెస్‌కు తాము ఎప్పుడు వ్యతిరేకమేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తున్నామంటూ బీజేపీపై ఎవరు మాట్లాడిన తెలివి తక్కువ తనమే అవుతుందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pushpa 2: అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం పోలీసుల యాక్షన్ ప్లాన్ అదేనా..!
Hyderabad: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. కీలక మలుపు తిరిగిన కేసు..
Rachakonda CP: ఈ ఏడాది క్రైమ్ రేట్ ఎంతో చెప్పిన రాచకొండ సీపీ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 23 , 2024 | 02:40 PM