ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: రేవంత్ తేల్చుకుందాం.. కేటీఆర్ సవాల్

ABN, Publish Date - Dec 22 , 2024 | 10:31 AM

సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంపై అర్థంలేని కక్ష.. పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష వేశారని మండిపడ్డారు. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి పాలమూరు బిడ్డ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తుకెళ్లినా రేవంత్ ప్రభుత్వానికి పట్టడం లేదా అని కేటీఆర్ నిలదీశారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో నిన్న(శనివారం) రుణమాఫీ చర్చ జరిగిన విషయం తెలిసిందే. రుణమాఫీపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా కేటీఆర్ స్పందించారు. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా అని ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారని అన్నారు. వందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండాప్రభుత్వం తోక ముడిచిందని విమర్శించారు. రుణమాఫీ కానీ రైతన్నలకు రేవంత్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకని ప్రశ్నించారు. రా పోదాం పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి .. రా పోదాం అడవుల తల్లి ఆదిలాబాద్ అని సవాల్ విసిరారు. ధనోరా రోడ్డు మీద కూసున్న రైతుల ముందే మీ మాయల మాఫీ లెక్కలు తేల్చుదామని ఛాలెంజ్ చేశారు.


రుణమాఫీ మాయ, రైతుభరోసా రూ. 7500 మాయ, తులం బంగారం మాయ, మహిళలకు రూ.2500 మాయ, రూ.4000 ఆసరా ఫించన్లు మాయ, రూ.6000 దివ్యాంగుల ఫించన్లు మాయ అని విమర్శలు చేశారు. జాగో తెలంగాణ జాగో అని ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ టార్గెట్‌గా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంపై అర్థంలేని కక్ష.. పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష వేశారని మండిపడ్డారు. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి పాలమూరు బిడ్డ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తుకెళ్లినా రేవంత్ ప్రభుత్వానికి పట్టడం లేదా అని నిలదీశారు. కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించినా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం రావడం లేదని మండిపడ్డారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కరువు.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పోతున్న తెలంగాణ పరువు అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Allu Arjun: అల్లు అర్జున్‌‌ వ్యాఖ్యలపై ఊహించని పరిణామం

CM Revanth Reddy: మానవత్వం లేదా ?

Child Custody: పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి

MLC Jeevan Reddy: హోంగార్డుల వేతనం పెంచాలి: జీవన్‌ రెడ్డి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 22 , 2024 | 11:37 AM