Share News

KTR: ఇది కక్ష్యా.. శిక్ష్యా.. నిర్లక్ష్యమా..: కేటీఆర్

ABN , Publish Date - Dec 30 , 2024 | 09:55 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నేడు అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు.

KTR: ఇది కక్ష్యా.. శిక్ష్యా..  నిర్లక్ష్యమా..: కేటీఆర్
BRS Leader KTR

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై సోషల్ మీడియా ఎక్స్ (Social Media X) వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘ఇది కక్ష్యా.. ఇది శిక్ష్యా,, ఇది నిర్లక్ష్యమా’.. పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం.. ఏడాదిలో ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా.. మండలానికి ఒక్క గురుకుల పాఠశాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా.. అందుకే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతున్నారా.. ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. ప్రతిష్ఠాత్మకంగా సీఎం నుండి మంత్రుల వరకు కామన్ డైట్ అంటూ అట్టహాసంగా ప్రారంభించింది ఆరంభ శూరత్వమేనా’’.. అని ప్రశ్నించారు.


కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నేడు అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు. కాగా కేటీఆర్ నాయకత్వంలో సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. మన్మోహన్ సింగ్ సంతాప‌ తీర్మానంపై సభలో బీఆర్ఎస్ తరుఫున కేటీఆర్ మాట్లాడనున్నారు.

కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని, ఆ ఆశయం ఫలించాలని మనస్ఫూర్తిగా ఆశించిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ అని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌కు మన్మోహన్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉందని.. తెలంగాణ ఉద్యమ సమయంలో అధైర్య పడొద్దని, వెన్నుతట్టి ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్‌ పార్థివదేహానికి బీఆర్‌ఎస్‌ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, దామోదర్‌రావులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశాన్ని మన్మోహన్‌ ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకెళ్లారని, ప్రపంచంలో దేశ ఖ్యాతిని పెంచారని తెలిపారు. దాదాపు రెండేళ్లపాటు ఆయన కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్‌ పనిచేశారని గుర్తు చేశారు. 2004లో కేంద్ర మంత్రివర్గంలో చేరిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు ఆటుపోట్లు ఎదురైతే అధైర్య పడొద్దని ప్రోత్సహించారని చెప్పారు.


కాగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి సంతాపం తెలపడానికి సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతగా అసెంబ్లీలో నివాళులర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు సభ సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల ఏర్పాట్లను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం పరిశీలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీఠ..

ఏపీ కొత్త సీఎస్ ట్రాక్ రికార్డు ఇదే..

అరబిందో ‘అత్యవసర’ అక్రమాలు..

ప్రైవేట్‌ బ్యాంకులకు తప్పని ఉద్యోగుల వలసలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 30 , 2024 | 09:55 AM