ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: సీఎం రేవంత్ రెడ్డి అమృత్ టెండర్ల పేరుతో కుట్రకు తెర లేపారు

ABN, Publish Date - Sep 24 , 2024 | 04:24 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన కుటుంబ సభ్యులకు వందల కోట్ల రూపాయల టెండర్‌ను కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు ఆరోపించారు. సీఎం రేవంత్ ఇలా చేయడం ముమ్మాటికి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని అన్నారు. రేవంత్ కుటుంబ సభ్యులకు అనుచితమైన ఆర్థికలబ్ధిని కలిగించేందుకు తన పదవిని అడ్డు పెట్టుకోవడం అనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద కూడా నేరమని కేటీఆర్ ఆరోపించారు.

KTR

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారంలోకి రాగానే భారీగా ముడుపులు వచ్చే కార్యక్రమాలపైన దృష్టి పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. అమృత్ టెండర్లపై కేటీఆర్ ఇవాళ(మంగళవారం) ప్రెస్‌నోట్ విడుదల చేశారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల టెండర్ల పేరుతో కుట్రకు తెర లేపారని ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన ఒకటి రెండు నెలల్లోనే తాను గతంలో బాధ్యతలు నిర్వహించిన మున్సిపల్ శాఖలో సీఎం రేవంత్ వివిధ పనులకు టెండర్లు పిలిచారని అన్నారు. 26 పురపాలక పట్టణాల్లో తాగునీటి ప్రాజెక్టులు సీవరేజ్ పనులకు సుమారు 9000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారని తెలిపారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన టెండర్ల గడువు ప్రక్రియ పూర్తయిందని కేటీఆర్ పేర్కొన్నారు.


ALSO READ: CM Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. ఏంటంటే

టెండరింగ్‌కు సంబంధించి ఏ సమాచారం లేదు...

‘‘ఈ టెండర్లలో సీఎం రేవంత్‌కు సంబంధించిన కంపెనీలను దొడ్డి దారిన ప్రవేశపెట్టి పనులు అప్పగించారు. అందుకే ఈ మొత్తం వ్యవహారం తాలూకు సమాచారాన్ని ప్రభుత్వం ఏ వెబ్‌సైట్లోనూ ఉంచలేదు. ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు పనుల టెండరింగ్ ప్రక్రియ పూర్తి అయిన ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఒక్క పత్రిక ప్రకటన కూడా రాలేదు. ఏయే ప్రాంతాల్లో పనులను పిలిచారు. ఎక్కడ ఏ ఏ కంపెనీలకు టెండర్లు దక్కాయి. టెండర్ పనుల విలువ వంటి ఏ సమాచారాన్ని కూడా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. అయితే టెండర్లు దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ స్టాక్ లిస్టెడ్ కంపెనీ కావడంతో... వారికి దక్కిన టెండర్ల తాలూకు సమాచారాన్ని సెబీకి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఈ టెండర్ల స్కామ్ బయటకు వచ్చింది. ఈ కంపెనీ సెబీకి ఇచ్చిన సమాచారం ప్రకారం రూ.1137 కోట్ల టెండర్లను సంస్థ దక్కించుకుంది’’ అని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.


ALSO READ: Adi Srinivas: కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో..సుద్దపూస ముచ్చట్లు ఆపు

శోధా కన్స్‌స్ట్రక్షన్‌కు ఎలాంటి అర్హతలు లేవు...

‘‘ఈ టెండర్లలో 80% పనులను మరో రెండు కంపెనీలకు జాయింట్ వెంచర్ రూపంలో ఇస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు కంపెనీల్లో ఒక కంపెనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయానా బావమరిది సూదిని సృజన్ రెడ్డి సంస్థ అయిన శోధా కన్స్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీకి ఈ జాయింట్ వెంచర్‌లో భాగస్వామ్యం ఉంది. ఈ కంపెనీకి ఎలాంటి అర్హతలు లేకపోవడంతో నేరుగా టెండర్లలో పాల్గొనలేదు. ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీపైన ఒత్తిడి తీసుకువచ్చి టెండర్లు వేయించి అందులో 80% పనులను ముఖ్యమంత్రి బావమరిది ఆయన బినామీ కంపెనీలకు అప్పచెప్పారు. ఈ శోధా కన్స్‌స్ట్రక్షన్ కంపెనీకి ఆర్థిక సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ రెవెన్యూ ఏడాదికి కేవలం రూ.71 కోట్లు మాత్రమే, రూ. 2 కోట్లు మాత్రమే లాభం కలిగిన ఈ కంపెనీ ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు‌ను ఎలా పూర్తి చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు లేకపోవడంతో నేరుగా టెండర్లలో పాల్గొనని ఈ కంపెనీ దొడ్డిదారిన అవే పనులను చేపట్టడం సరైనది కాదు’’ అని కేటీఆర్ తెలిపారు.


ALSO READ: KTR: శేరిలింగంపల్లి నియోజకవర్గంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ అమృత్ టెండర్‌ను కట్టబెట్టారు...

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన కుటుంబ సభ్యులకు వందల కోట్ల రూపాయల టెండర్‌ను కట్టబెట్టడం ముమ్మాటికి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. దీంతోపాటు తమ కుటుంబ సభ్యులకు అనుచితమైన ఆర్థికలబ్ధిని కలిగించేందుకు తమ పదవిని అడ్డు పెట్టుకోవడం అనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద కూడా నేరం. ఇవే ఆరోపణలపైన గతంలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ (నేషనల్ అడ్వైజరీ కమిటీ), మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ (ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాం), కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప (తమ కుటుంబ సభ్యులకు ఇల్లీగల్ మైనింగ్ అప్పజెప్పడం) వంటి ఆరోపణల కింద పదవిని కోల్పోయారు. ఇవే అంశాలతో మేము కచ్చితంగా ముఖ్యమంత్రి వ్యవహారాలను అమృత్ టెండర్ల స్కాంను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. అయితే సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయల ఈ అమృత్ టెండర్ల విషయంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన బినామీ కంపెనీలతో చాలా కంపెనీలు సబ్ కాంట్రాక్టులు తీసుకున్నాయి. ఇది కేవలం అందుబాటులోకి వచ్చిన సమాచారం మాత్రమే. ఈ వ్యవహారంలో జరిగిన వందల కోట్ల అవినీతి తాలూకు ఒక్క ఉదాహరణ మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ టెండర్ల తాలూకు మొత్తం వివరాలను బయటపెట్టి ఆ టెండర్లను రద్దు చేయాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ కామెంట్స్..

Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ..

V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన

BRS VS Congress వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ

Read Latest Telangana News and Telugu News

Updated Date - Sep 24 , 2024 | 04:43 PM