KTR: సీఎం రేవంత్ భారీ కుంభకోణం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
ABN, Publish Date - Sep 21 , 2024 | 05:22 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీ కోసం భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. వేలకోట్ల రూపాయలు పనులను సీఎం రేవంత్ కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాం రూ. 8,888 కోట్లు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALSO Read:Gangula Kamalakar: ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోంది
ముఖ్యమంత్రి బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయలు పనులను కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి.. ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు.
ALSO Read: Prashanth Reddy: పీఏసీ నియామకంలో కూడా రాజకీయాలా..
‘‘పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారు. ఇందులో టెండర్ దక్కించుకున్న సదరు కంపెనీతో రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకు తెరలేపారు. 1137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20 శాతం పనిచేస్తోంది. ముఖ్యమంత్రి బావమరిది మాత్రం 80% పని అంటే రూ. 1000 కోట్ల పని చేస్తోంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇంత పెద్ద భారీ కుంభకోణానికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారు. తాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించిన పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణాన్ని చేశారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవీ కోల్పోయి అవకాశం ఉంది’’ అని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Prashanth Reddy: పీఏసీ నియామకంలో కూడా రాజకీయాలా..
KTR: ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్..=
Sridhar Babu: సేమీ కండక్టర్ల రంగంలో ఉపాధి అవకాశాలు..
KTR: ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్..
For More Telangana News and Telugu News..
Updated Date - Sep 21 , 2024 | 05:31 PM