ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Harish Rao:చంద్రబాబు మాదిరిగా రేవంత్‌రెడ్డి పింఛన్లు పెంచాలి

ABN, Publish Date - Jun 14 , 2024 | 08:07 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

Harish Rao

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ, 191 రోజులు గడిచినా ఆచరణలో మాత్రం విఫలమైందని మండిపడ్డారు.


ఈ రోజు(శుక్రవారం) ట్విట్టర్(X) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రకాల పింఛన్లు పెంచారని తెలిపారు. ఒరిస్సా ముఖ్యమంత్రి వరికి కనీస మద్దతు ధర క్వింటల్ కు రూ. 3100 చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా, వృద్ధులు, వితంతువుల పింఛన్లు రూ. 4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు పెంచుతూ తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10% మాత్రమే పండించే సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారెంటీలు, 13 హామీల అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Komati Reddy: తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

KCR: కేసీఆర్ నోటీసులపై ఉత్కంఠ

Telangana: యూనిట్లు 294.. కరంట్ బిల్లు రూ. 29 కోట్లు

KTR: తీహార్ జైల్లో కవితతో కేటీఆర్ ములాఖత్..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 08:15 PM

Advertising
Advertising