Share News

phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Apr 20 , 2024 | 10:25 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (phone tapping case) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాధాకిషన్ రావు ఈ కేసులో A4గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధ కిషన్ రావు కోర్టును కోరారు.

phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

phone tapping case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (phone tapping case) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాధాకిషన్ రావు ఈ కేసులో A4గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధ కిషన్ రావు కోర్టును కోరారు. రేపు(ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. కరీంనగర్‌లో ప్రైవేట్ హాస్పిటల్లో రాధా కిషన్ రావు తల్లి చికిత్స పొందుతున్నారు.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ బ్యాకప్‌! దొరికిందో కథ వేరే లెవెల్..!


తన తల్లి దగ్గర కొద్ది గంటలు ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. రేపు(ఆదివారం) ఉదయం పోలీస్ ఎస్కార్ట్ నడుమ జైల్ నుంచి కరీంనగర్‌కు రాధా కిషన్ రావు వెళ్లనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావు పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండటంతో పలువురు పోలీసు అధికారులు టెన్షన్‌కు గురువుతున్నారు.

‘ట్యాపింగ్‌’ తేలితే కఠిన చర్యలే!

మరిన్ని వార్తల కోసం... ఫోన్ ట్యాపింగ్ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 10:34 PM