Mallu Ravi: పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు మూసీని ఎందుకు పట్టించుకోలేదు
ABN, Publish Date - Oct 18 , 2024 | 09:40 PM
కేసీఆర్ ప్రభుత్వం మూసీని బాగు చేయలేదు కాబట్టే తమ ప్రభుత్వం బాగు చేయాల్సి వస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ, 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల నియామకాలు, ఫ్రీ బస్ ఇవన్నీ తామే ప్రజలకు ఇస్తున్నామని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వన్నీ చేసి ఉంటే తమ ప్రభుత్వం ఇంకా ప్రాధాన్యత కార్యక్రమాలు చేసే వారమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని.. ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పిన కూడా గులాబీ పార్టీ నేతలకు గుణపాఠం నేర్చుకోలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. ఇవాళ(శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు. మూసీనది పునర్జీవన కార్యక్రమం ఎంతో పవిత్రమైన కార్యక్రమమని.. ఒక యజ్ఞం లాంటిది అని ఎంపీ మల్లు రవి చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఈ మూసీనది పునర్జీవన కార్యక్రమం సజావుగా సాగడానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను కోరారని ఎంపీ మల్లు రవి అన్నారు. అయిన బీఆర్ఎస్ నాయకులు సహకరించకపోగా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం అవివేకమని ఎంపీ మల్లు రవి అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో మూసీనది అభివృద్ధికి కృషి చేస్తే ఈ రోజు మూసీ పరిస్థితి ఎందుకు ఇలా ఉండేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నాయకులు మూసీ పక్కన ముక్కు మూసుకోకుండా ఉండగలరా అని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం మూసీని బాగు చేయలేదు కాబట్టే తమ ప్రభుత్వం చేయాల్సి వస్తుందని తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ, 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల నియామకాలు, ఫ్రీ బస్ ఇవన్నీ తామే ప్రజలకు ఇస్తున్నామని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వన్నీ చేసి ఉంటే తమ ప్రభుత్వం ఇంకా ప్రాధాన్యత కార్యక్రమాలు చేసే వారమని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేయకపోగా తాము చేస్తుంటే సహకరించకుండా అడ్డుకోవడం అవివేకమేనని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. తగిన సమయంలో తగిన విధంగా జవాబు చెబుతారని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి
Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ ఏ రేంజ్‌లో సవాల్ విసిరారంటే
రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు
మార్కెట్లోకి అదిరిపోయే ఈవీ బైక్.. ఫీచర్లు తెలిస్తే
For More Telangana News and Telugu News..
Updated Date - Oct 18 , 2024 | 09:41 PM