TG News: గంజాయి పట్టివేతపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఏమన్నారంటే?
ABN , Publish Date - Sep 14 , 2024 | 03:49 PM
Telangana: నగరంలోని పెద్ద అంబర్పేట్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిందితుల కదలికలను చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నామన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్‌లోని (Hyderabad) పెద్ద అంబర్పేట్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పెద్ద ఎత్తున గంజాయి (Ganja) స్వాధీనం చేసుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిందితుల కదలికలను చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నామన్నారు.
Vijayawada: విజయవాడలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన
దీంతో పక్కా సమాచారంతో 170 కిలోల గంజాయి సీజ్ చేసామని తెలిపారు. మొత్తం ఈ ముఠాలో ఎనిమిది మంది నిందితులు ఉన్నారని.. అందర్నీ అరెస్ట్ చేసామన్నారు. నిందితులు మొత్తం మహారాష్ట్రలో ఒకే గ్రామానికి చెందినవారన్నారు. పట్టుబడ్డ వ్యాన్‌లో గంజాయి సరఫరా చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారన్నారు. గంజాయ్ తీసుకు వెళుతున్న వాహనానికి ముందు మరొక వాహనంతో ఎస్కార్ట్‌గా వచ్చారన్నారు. మల్కాన్ గిరి ప్రాంతంలో ఈ గంజాయిని ప్యాక్ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారన్నారు. ఈ ముఠాలో ఇస్మాయిల్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు ఉన్నాడన్నారు.
Nirmala Sitharaman: క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..
ప్రోక్లైన్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఇస్మాయిల్.. తన పనిలో భాగంగా రాయపూర్‌లో పనిచేస్తున్న క్రమంలో సంతోష్ పరిచయం అయ్యాడని.... అతని ద్వారా గంజాయి సరిఫరాలోకి ఇస్మాయిల్ వచ్చాడని తెలిపారు. ఇస్మాయిల్ మహారాష్ట్రలో ఉండే సప్లయర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని మహారాష్ట్రకు గంజాయి సప్లై చేస్తున్నాడన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.34 లక్షలు ఉంటుందన్నారు. ఇస్మాయిల్‌పై గతంలో మహారాష్ట్రలో కేసు నమోద అయిందని.. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు. ఈ కేసులో నిందితుల నేర చరిత్రను బట్టి పిడీ యాక్ట్ పెడతామని ఖరేషి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Viral: ఓర్నీ.. లీవ్‌లెటర్ ఇలా ఎవరైనా రాస్తారా? స్టూడెంట్ రాసిన లెటర్ చూసి అవాక్కైన టీచర్..
TG News: ఆస్తి కోసం బావ ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే
Read LatestTelangana NewsAndTelugu News