Minister Damodar:నిమ్జ్ వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
ABN, Publish Date - Jun 26 , 2024 | 04:10 PM
నిమ్జ్ వల్ల ఈ ప్రాంతంలో 3 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) తెలిపారు. నిమ్జ్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన అని చెప్పారు.
సంగారెడ్డి: నిమ్జ్ వల్ల ఈ ప్రాంతంలో 3 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) తెలిపారు. నిమ్జ్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన అని చెప్పారు. ఆనాడు 2018లో మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం 123 జీవో రద్దు చేయాలని ఆసైన్డ్ భూములు పట్టా భూములకు సమానంగా పరిహారం ఇవ్వాలని పోరాటం చేశామని గుర్తుచేశారు.
ఈరోజు ( బుధవారం) ఝరాసంఘం మండల కేంద్రంలోని ఎల్గోయి, ముంగి గ్రామాలకు చెందిన 500 వందల ఎకరాల నిమ్జ్ భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్, ఎమ్మెల్యే మాణిక్ రావు, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ... నిమ్జ్‌లో మిగిలిన 900 మంది రైతులకు 2013 చట్టప్రకారం పరిహారం చెల్లించటానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
నిమ్జ్ రావడంతో జహీరాబాద్ నియోజకవర్గ చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఉద్ఘాటించారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ. 50 వేల కోట్ల వరకు పెరుగుతుందని తెలిపారు. రైతు రుణ మాఫీలో భాగంగా 31 వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చబోతుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు
ఈ వార్తలు కూడా చదవండి
Deputy CM Bhatti: రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రమంత్రితో సీఎం, మంత్రుల చర్చ
Jagadish Reddy: సీఎం రేవంత్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా రు.. జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News and Telugu News
Updated Date - Jun 26 , 2024 | 04:15 PM