Sridhar Babu: ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ బయటకు వస్తారు
ABN, Publish Date - Apr 03 , 2024 | 02:28 PM
Telangana: ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోట్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ బయటకి వస్తారన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 3: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోట్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth reddy) ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ బయటకి వస్తారన్నారు. అందరి ఫోన్‌లు ట్యాప్ చేశారని.. విచారణలో అన్నీ బయటకు వస్తాయని తెలిపారు. కేటీఆర్ (KTR) నోటీసులు ఇచ్చుకుంటే ఇచ్చుకో అని అన్నారు. తాము పద్దతి ప్రకారం పనిచేస్తామన్నారు. మిషన్ భగీరథ తప్పుడు స్కీం అని వ్యాఖ్యలు చేశారు. తాము తెచ్చిన వాటర్ మేకానిజం కంటిన్యూ చేయొద్దని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తప్పు అని అన్నారు.
Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..
తమ ప్రభుత్వం గురించి కేటీఆర్ రైతులను అడిగితే తెలుస్తుందని.. తాము ఏం చేస్తామో సంవత్సరంలో చేసి చూపిస్తామన్నారు. రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్‌లో రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి రైతును మోసం చేశారన్నారు. గత ప్రభుత్వ పాలనలో నాటి సీఎం, వ్యవసాయ మంత్రికి రైతుల కోసం ఎన్ని విజ్ఞాపనలు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో వర్షాలుపడలేదని.. కాంగ్రెస్ పాలనలో కరువు వచ్చిందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం బీఆర్ఎస్ హడావిడి చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. తెనాలి పర్యటన రద్దు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 03 , 2024 | 02:33 PM